అడుక్కు తినేవాడికి 64 కూరలు అంటారు కానీ అడుక్కుని తినేవాడికి సరిహద్దులు కూడా ఉండవు.

అడుక్కు తినేవాడికి 64 కూరలు అంటారు కానీ అడుక్కుని తినేవాడికి సరిహద్దులు కూడా ఉండవు. ఎక్కడైనా వెళ్లి దర్జాగా అడుక్కుతినేసి హాయిగా బతికేయవచ్చు. పాకిస్తాన్‌(Pakistan)లోని బిచ్చగాళ్లు చేస్తున్నది ఇదే! వారి కారణంగా తమకు తలనొప్పి వస్తున్నదని ఇస్లామిక్‌ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. ముస్లిం మత పవిత్ర ప్రదేశాలను దర్శించడానికి పాకిస్తాన్‌ నుంచి వచ్చే కొందరు తిరిగి తమ దేశానికి వెళ్లడం లేదు. వారు అక్కడే అడుక్కుతింటూ కాలం గడిపేస్తున్నారు. పాకిస్తాన్‌లోని జీవితం కంటే ఇక్కడే హాయిగా ఉందంటున్నారు. పాపం ఇస్లామిక్‌ దేశాలు మాత్రం ఎంతని భరిస్తాయి. ఆ దేశాలకు పాక్‌ బిచ్చగాళ్లతో ఇబ్బందులు ఎదురవ్వడంతో పాక్‌ దౌత్యవేత్తలకు వార్నింగ్‌ ఇచ్చాయట ఇస్లామిక్‌ దేశాలు. పాకిస్తాన్‌ పక్క దేశాలకు టెర్రరిస్టులను ఎగుమతి చేస్తుందనే అనుకున్నాం కానీ బిచ్చగాళ్లను కూడా సరఫరా చేస్తుందని అనుకోలేదు.

సౌదీ అరేబియా(Saudi Arabia)ఏకంగా బిచ్చ‌గాళ్ల‌ను కంట్రోల్ చేయండంటూ పాకిస్తాన్ దౌత్య‌వేత్త‌ల‌కు హెచ్చ‌రిక జారీ చేసింది. హజ్‌ యాత్ర(Haj tour) పేరు చెప్పుకుని పాకిస్తాన్‌ నుంచి వీసాలకు అప్లై చేసుకునేవారిలో చాలా మంది తిరిగి వెళ్లకుండా అక్కడే ఉంటున్నారు. యాత్రికుల దగ్గర బిచ్చం అడుక్కుంటూ జీవితాన్ని గడిపేస్తున్నారు. ఇలాంటి వారి తాకిడి ఎక్కువ‌య్యే స‌రికి హ‌జ్ యాత్ర‌కంటూ ఇక‌పై పాకిస్తాన్‌ నుంచి వ‌చ్చే ద‌ర‌ఖాస్తుల విష‌యంలో తాము పున‌రాలోచించుకోవాల్సి వ‌స్తుందంటూ సౌదీ అరేబియాకు చెందిన మంత్రి పాకిస్తాన్‌ను హెచ్చ‌రించారట!

సౌదీ అరేబియాలో బిచ్చ‌గాళ్లను అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నిస్తే, వారిలో 90 శాతం మంది పాకిస్తాన్‌కు చెందిన వారేనని తేలింది. దీంతో హ‌జ్ యాత్ర‌కంటూ పాకిస్తాన్‌ నుంచి వ‌చ్చే అప్లికేష‌న్ల విష‌యంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని సౌదీ అరేబియా ప్రకటించింది. ఒక్క సౌదీ అరేబియాకే పాకిస్తాన్ బిచ్చగాళ్లు(Pakistani beggars)పరిమితం కాలేదు. వారు ఇత‌ర ఇస్లామిక్ దేశాల‌ను కూడా టార్గెట్ గా చేసుకున్నార‌ట‌! యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(UAE) కూడా వీరి సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. పాకిస్తాన్‌ నుంచి ఏదోలా అక్క‌డ‌కు చేరుకుని అడుక్కు తినే వాళ్లు ఎక్కువ‌వుతున్నారు. చివరాఖరికి ఇరాన్‌ను కూడా వదిలిపెట్టలేదు వీరు. పాకిస్తాన్‌లో ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. నిరుద్యోగం ప్రబలిపోయింది. నిత్యావసరవస్తువుల ధరలు పెరిగిపోయాయి. సైన్యానికి జీతాలు ఇవ్వడానికే పాక్‌ దగ్గర డబ్బులు లేవట! పాకిస్తాన్‌లో బతకడం కష్టం కావడంతోనే బిచ్చగాళ్లు పరాయి దేశాలకు వలసవెళుతున్నారు. డబ్బున్నవారే ఆస్తులు అమ్ముకుని ఇతర దేశాలకు వలస వెళుతున్నప్పుడు బిచ్చగాళ్లు వెళ్లరా ఏమిటి? మొత్తంగా పాక్‌లో ఉండటం కంటే వేరే దేశాలకు వెళ్లి అడుక్కు తిని బతకడం బెటరని ప్రూవ్‌ చేశారు.

ehatv

ehatv

Next Story