Jews Old Culture : యూదుల బ్లడ్డు, బ్రీడు వేరట! చావనైనా చస్తారు కానీ వేరేవాళ్ల రక్తం తీసుకోరట!
యూదులంటే(Jews) ఎవరో తెలుసుగా? ఇజ్రాయెల్ దేశవాసులు. చెల్లా చెదురుగా ఉన్న యూదులకు ఇజ్రాయెల్ అనే దేశాన్ని భౌగోళికంగా ఏర్పాటు చేశాయి అమెరికా(america), బ్రిటన్(Britain) దేశాలు. సరే ఇది పాత చరిత్ర. ప్రస్తుతం హమాస్‌పై(Hamas) యుద్ధం చేస్తోంది ఇజ్రాయెల్(Israel). ఈ యుద్ధంలో ఇరుపక్షాలకు చెందిన వందలాది మంది చనిపోయారు.
యూదులంటే(Jews) ఎవరో తెలుసుగా? ఇజ్రాయెల్ దేశవాసులు. చెల్లా చెదురుగా ఉన్న యూదులకు ఇజ్రాయెల్ అనే దేశాన్ని భౌగోళికంగా ఏర్పాటు చేశాయి అమెరికా(america), బ్రిటన్(Britain) దేశాలు. సరే ఇది పాత చరిత్ర. ప్రస్తుతం హమాస్‌పై(Hamas) యుద్ధం చేస్తోంది ఇజ్రాయెల్(Israel). ఈ యుద్ధంలో ఇరుపక్షాలకు చెందిన వందలాది మంది చనిపోయారు. లెక్కలేనంత మంది గాయపడ్డారు. చిత్రమైన విషయమేమిటంటే యూదులు తమ వైద్య చికిత్సలో ఎవరి నుంచి కూడా రక్తాన్ని తీసుకోరట! సోషల్ మీడియాలో ఇద వైరల్ అవుతోంది. యూదులు కూడా మా బ్లడ్డు వేరు, మా బ్రీడు వేరు అన్న టైపేమోనన్నది చాలా మంది అనుమానం! యూదుల పవిత్రగ్రంథం పేరు తోరా(Thora). అందులో ఉన్న నియమ నిబంధలను యూదులు తప్పకుండా పాటిస్తారు. కాలంతో పాటు ఆ నిబంధనలలో కూడా కొన్ని మార్పలు వచ్చాయనుకోండి. అయినప్పటికీ పాత తరం యూదులు మాత్రం ఈ నియమాల విషయంలో చాలా కఠినంగా ఉంటారు. చికిత్స సమయంలో ఎవరి రక్తాన్ని(Blood) తీసుకునేందుకు ఇష్టపడరు. వారు ఎంత అనారోగ్యంతో ఉన్నా మరొకరి రక్తాన్ని తమ శరీరంలోకి ఎక్కించడాన్ని వారు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే యూదులు రక్తాన్ని ప్రాణంతో సమానంగా భావిస్తారు. వేరొకరి రక్తాన్ని తీసుకోవడమంటే వారి ప్రాణాన్ని తీయడమేనని భావిస్తారు. పాతకాలం నాటి యూదులు దైవశక్తిని బాగా నమ్మేవారు. తాము అనారోగ్యానికి గురైనప్పుడు దేవుని ప్రార్థన ద్వారా మాత్రమే ఆరోగ్యవంతులమవుతామని విశ్వసిస్తారు. చాలామంది యూదులు ఇవాళ్టికి డాక్టర్ల దగ్గరకు వెళ్లరు. చికిత్స తీసుకోరు. మందులు వాడరు. ఇప్పుడలా కాదు. నేతి తరం యూదులు వైద్యాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నారు.