పని మీదో, పర్యటన కోసమో అగ్రరాజ్యం అమెరికా(America)కు వెళ్లినవారిలో చాలా మంది వైట్‌హౌజ్‌(White House)ను చూడకుండా వెనక్కి రారు. అమెరికా అంతటి గొప్ప దేశపు అధ్యక్షుడు నివాసం ఉండే చోటు కాబట్టి సహజంగానే వైట్‌హౌజ్‌కు ఓ గుర్తింపు వచ్చింది. తెల్ల రంగులో ఉందన్న కారణంగా దాన్ని వైట్‌ హౌజ్‌ అంటారనుకుంటే పొరపాటే! ఆ మాటకొస్తే మొదట్లో ఆ భవంతి పేరు వైట్‌ హౌసే కాదు..

పని మీదో, పర్యటన కోసమో అగ్రరాజ్యం అమెరికా(America)కు వెళ్లినవారిలో చాలా మంది వైట్‌హౌజ్‌(White House)ను చూడకుండా వెనక్కి రారు. అమెరికా అంతటి గొప్ప దేశపు అధ్యక్షుడు నివాసం ఉండే చోటు కాబట్టి సహజంగానే వైట్‌హౌజ్‌కు ఓ గుర్తింపు వచ్చింది. తెల్ల రంగులో ఉందన్న కారణంగా దాన్ని వైట్‌ హౌజ్‌ అంటారనుకుంటే పొరపాటే! ఆ మాటకొస్తే మొదట్లో ఆ భవంతి పేరు వైట్‌ హౌసే కాదు.. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అమెరికాకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1792లో జార్జి వాషింగ్టన్ అధ్యక్షుడయ్యారు. ఆయనే అమెరికాకు మొట్టమొదటి అధ్యక్షుడన్నమాట! అధ్యక్షులకు ఓ అధికార భవనం ఉంటే బాగుంటుందని ఆయన అనుకున్నారు. ఆ కాలంలో వాషింగ్టన్‌ అంతగా అభివృద్ధి చెందలేదు. అధ్యక్ష భవనం ఎలా ఉండాలి? నిర్మాణ శైలి ఏ విధంగా ఉండాలి? వగైరా వగైరా తెలపాల్సిందిగా ఆయన ప్రజలను కోరారు. చక్కగా డిజైన్‌ చేసిన వారికి బహుమతి కూడా ఉంటుందని చెప్పారు. దాంతో ఆర్కిటెక్చర్లు, ఔత్సాహికులు, వాస్తు శిల్పులు ఆ పనిలో పడ్డారు. తాము కష్టపడి రూపొందించిన డిజైన్లను పంపించారు. వాటిల్లో అమెరికా చరిత్ర ప్రతిబింబించేలా.. అమెరికా సంస్కృతి కనిపించేలా చాలా మంది డిజైన్లు రూపొందించి పంపారు. ఎంపిక కష్టమైనప్పటికీ చివరాఖరికి ఐర్లాండ్‌కు చెందిన ఆర్కిటెక్ట్‌ జేమ్స్‌ హోబన్‌ రూపొందించిన డిజైన్‌ను ఎంపిక చేశారు. డబ్లిన్‌లోని లెన్ట్సర్‌ హౌస్‌ను స్ఫూర్తిగా తీసుకుని అధ్యక్ష భవంతిని డిజైన్‌ చేశారు హోబన్‌. అయితే ఇప్పుడు మనం చూస్తున్న వైట్‌హౌస్‌ పూర్తిగా ఆయన డిజైనేమీ కాదు. వాషింగ్టన్‌ తర్వాత చాలా మంది అమెరికాకు అధ్యక్షులయ్యారు కదా! వారిలో ఎక్కువ మంది అందులో నివాసం ఉంటూ తమకు తోచిన విధంగా మార్పులు చేస్తూ వచ్చారు. జేమ్స్‌ మన్రో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సౌత్ పోర్టికో నిర్మించారు. అండ్రూ జాక్సన్‌ కాలంలో నార్త్‌ పోర్టికో నిర్మించారు. 1901లో అధ్యక్షుడిగా ఉన్న థియోడర్‌ రూజ్‌వెల్ట్‌ అధ్యక్ష నివాసానికి వైట్‌ హౌస్‌ అని పేరు పెట్టారు. అప్పట్నుంచి ఆ పేరే స్థిరపడిపోయింది. ఇప్పటి వరకు ఆ భవంతిలో ఎన్నో మార్పులు జరిగాయి కానీ పేరు మాత్రం అసలు మారలేదు.

Updated On 18 Aug 2023 6:59 AM GMT
Ehatv

Ehatv

Next Story