రేడియో యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన పెంచడం మరియు ప్రసారకర్తల మద్య నెట్‌వర్కింగ్ మరియు అంతర్జాతీయ సహకారాన్ని పెంచడం ప్రపంచ రేడియో దినోత్సవం (World Radio Day) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

రేడియో యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన పెంచడం మరియు ప్రసారకర్తల మద్య నెట్‌వర్కింగ్ మరియు అంతర్జాతీయ సహకారాన్ని పెంచడం ప్రపంచ రేడియో దినోత్సవం (World Radio Day) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

ఫిబ్రవరి 13 నే ఎందుకు?

ఐక్యరాజ్యసమితి రేడియో (UN Radio) 13 ఫిబ్రవరి 1946 లో స్థాపించబడింది. ఈరోజుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13 న ప్రపంచ రేడియో దినోత్సవం (World Radio Day) ను జరుపుకుంటారు.

ఒకప్పుడు రేడియో సగటు మనిషి జీవితంలో అంతర్భాగం.. కలత చెందిన మనసుకు అదే ఓదార్పు. సంతోష సమయంలో అదే తోడు! సమాచారానికి అదే చేదోడు! కబుర్లు చెప్పే నెచ్చెలి అదే! ఇప్పటి తరానికి రేడియోతో అంత గొప్ప అనుభవాలు ఉండకపోవచ్చు కానీ, అప్పుట్లో రేడియోనే సమస్తం! పొద్దున్నే సిగ్నేచర్‌ ట్యూన్‌ సుప్రభాతం అయ్యేది.. మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమంతో పొద్దుపుచ్చేది! సాయంత్రం జనరంజకంగా పలకరించేది.. రాత్రి మనసును ఆహ్లాదపరచి నిద్రపుచ్చేది.. రేడియోతో ఉన్న సౌలభ్యమేమిటంటే అది మన రోజువారి పనులను చెడగొట్టేది కాదు.. పాటలో, కబర్లో వింటూనే పనులు చేసుకునేవారు! అందుకే రేడియో అంత పాపులరయ్యింది.. ఇవాళ ప్రపంచ రేడియో దినోత్సవం కాబట్టి రేడియో గురించి కాసింత తెలుసుకుందాం! ఇవాళ్టికీ రేడియోనే వినోదసాధనం! ప్రపంచ జనాభాలో 70 శాతానికి పైగా ప్రజలు రేడియోను వినియోగిస్తున్నారంటే నమ్మి తీరాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించి 75 శాతం మందికి పైగా గృహిణులు వివిధ అంశాల సమాచారం కోసం రేడియోపై ఆధార పడుతున్నారన్నది పచ్చి నిజం! ఎవరండీ రేడియోకు క్రేజ్‌ తగ్గిందన్నది! ఎవరండీ రేడియోను పాతచింతకాయ పచ్చడన్నది! రేడియో ఎవర్‌గ్రీన్‌! ఈనాటికి ప్రధాని మోదీ మన్‌ కీ బాత్‌ పేరిట దేశ ప్రజలతో తన మనసులో మాటలను, అభిప్రాయాలను షేర్‌ చేసుకుంటున్నారంటేనే రేడియో ఎంత గొప్ప మాధ్యమమో తెలిసిపోతున్నది...*

Updated On 13 Feb 2024 6:06 AM GMT
Ehatv

Ehatv

Next Story