America Presidant Elections : ఈ రోజే అమెరికా ఎన్నికలు...నవంబర్ మొదటి మంగళవారమే అధ్యక్ష ఎన్నికలు ఎందుకు?
అగ్రరాజ్యం అమెరికాలో(America) అధ్యక్ష ఎన్నికలు(Presidant elections) నవంబర్ మొదటి మంగళవారం రోజునే జరుగుతాయి.
అగ్రరాజ్యం అమెరికాలో(America) అధ్యక్ష ఎన్నికలు(Presidant elections) నవంబర్ మొదటి మంగళవారం రోజునే జరుగుతాయి. ఇది 170 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్నది. ఇందుకు చారిత్రక నేపథ్యం ఉంది. నిజానికి మొదట్లో రాష్ట్రాలకు వేర్వేరు రోజుల్లో ఎన్నికలు జరిగేవి. అయితే దేశం మొత్తం ఒకేసారి ఎన్నికల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో 1845లో ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారు. నవంబర్ నెల మొదటి మంగళవారమే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. అందుకు కారణం ఏమిటంటే, ఆ రోజుల్లో అమెరికా జనాభాలో ఎక్కువ మంది వ్యవసాయం చేసేవారు. నవంబర్ నెల ఆరంభంలో పంట నూర్పిడి పనులు పూర్తయ్యి ఖాళీగా ఉంటారు. ఓటు(vote) వేసేందుకు అనువైన సమయంగా భావించారు. అంతేకాదు ఈ సమయంలో ప్రయాణాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇక ఆదివారం క్రైస్తవులకు ఆరాధన దినం, బుధవారం రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు మార్కెట్‌కు వెళ్లేవారు. రవాణా వ్యవస్థ అంతగా లేని ఆ రోజుల్లో పోలింగ్ జరిగే కొన్ని స్థలాలకు చేరుకోవడానికి ఒక రోజు సమయం పట్టేది. దీంతో సోమ, గురువారాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. అన్నింటి కంటే మంగళవారం పోలింగ్ నిర్వహించడం ఉత్తమం అనే నిర్ణయానికి వచ్చారు.