పారిస్‌ ఒలింపిక్స్‌లో(Paris olympis) వినేశ్‌ ఫోగట్‌(Vinesg phogt) భారత కీర్తి పతాకను రెపరెపలాడిస్తుందని ఆశించాం.

పారిస్‌ ఒలింపిక్స్‌లో(Paris olympis) వినేశ్‌ ఫోగట్‌(Vinesg phogt) భారత కీర్తి పతాకను రెపరెపలాడిస్తుందని ఆశించాం. స్వర్ణ పతకంలో సగర్వంగా స్వదేశానికి వస్తుందని ఆశపడ్డాం. కానీ ఓవర్‌వెయిట్‌ వినేశ్‌ ఆశలపై, మన ఆకాంక్షలపై నీళ్లు చల్లింది. అధిక బరువు కారణంగా వినేశ్‌ చరిత్ర సృష్టించే అవకాశాన్ని చేజార్చుకుంది.

రెజ్లింగ్‌ పోటీల విషయానికి వస్తే రెండు రోజులు వ‌రుస‌గా బ‌రువును(Weight) చెక్ చేస్తారు. ప్రిలిమిన‌రీ రౌండ్స్ రోజుతో పాటు ఫైన‌ల్స్ జ‌రిగే రోజు ఉద‌యం కూడా వెయిట్‌ను చెక్ చేస్తారు. వినేశ్‌పై అనర్హత వేటు ఎలా పడింది? ఎందుకు పడింది? 50 కిలోల ఫ్రీ స్టయిల్‌లో పోటీపడిన వినేశ్‌ ఫోగట్‌ వెయిట్‌ ప్రిలిమినరీ రౌండ్‌ రోజున నిబంధనల మేరకు సరిగ్గానే ఉంది. మంగళవారం కూడా బరువు చూశారు. 50 కిలోలలోపే ఉంది. అయితే ఆ రోజు వరుసగా మూడు బౌట్స్‌ వినేశ్‌ ఆడింది. రోజంతా ఆమె కొంత ఆహారాన్ని తీసుకుంది. దాంతో వినేశ్‌ బరువు పెరిగింది. రాత్రికి రాత్రే ఆమె రెండు కిలోల బరువు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. బరువు నిబంధనను అందుకోవడానికి ఆమె శ్రమించాల్సి వచ్చింది. అందుకే మంగళవారం రాత్రంతా ఆమె తీవ్రంగా శ్రమించింది. సెమీఫైనల్ మ్యాచ్‌ తర్వాత స్కిప్పింగ్‌ చేసింది. బరువు తగ్గడానికి రాత్రంతా అన్ని ప్రయత్నాలు చేసింది. పాపం ఎంత ప్రయత్నించినా ఆమె మరో వంద గ్రాములు అధిక బరువు ఉన్నట్టు తేలింది. యునైటెడ్ వ‌రల్డ్ రెజ్లింగ్ రూల్ బుక్ లోని ఆర్టిక‌ల్ 11 ప్ర‌కారం ఎవ‌రైనా అథ్లెట్‌.. తొలి రోజుతో పాటు రెండో రోజు కూడా ఒకే ర‌క‌మైన బరువు ఉండకపోతే ఆ అథ్లెట్‌ను కాంపిటీష‌న్ నుంచి ఎలిమినేట్ చేస్తారు. ఆ అథ్లెట్‌కు చివ‌రి ర్యాంక్‌ను కేటాయిస్తారు. బరువు విషయంలో వినేశ్‌ విఫలం చెందింది. వంద గ్రాముల బరువు అధికంగా ఉంది. దీంతో ఆమెను పోటీ నుంచి అన‌ర్హురాలిగా ప్ర‌క‌టించారు. క‌నీసం సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచే అవ‌కాశాన్ని కూడా ఆమె కోల్పోయింది.

Eha Tv

Eha Tv

Next Story