పాములను చూస్తే ఎవరికైనా భయమే! విషం లేని పాములన్నా జడుపే!

పాములను చూస్తే ఎవరికైనా భయమే! విషం లేని పాములన్నా జడుపే!

క్రూరజంతువుల పాలబడి మరణించిన మనుషుల కంటె పాముకాటుతో(snakebite) మరణించినవారే ఎక్కువ. ఎందుకంటే పాము మన ఆవాసాల చుట్టూ కూడా ఉంటూంటుంది. విషసర్పాలు కొన్నే అయినా, పాముకాటు భయంతో కొందరు మరణిస్తూ ఉంటారు. కొన్ని లక్షల ఏళ్ల నుంచి ఈ భూమ్మీద పాములు ఉంటూ వస్తున్నాయి. ఒక్క మన దేశంలోనే దాదాపు 350 రకాల పాములున్నాయి. కేరళలో(kerala) అత్యధిక పాములు ఉన్నాయట! అత్యంత విషపూరితమైన పాములు కూడా అక్కడ మనకు కనిపిస్తాయి. అయితే ప్రపంచంలో కొన్నిదేశాలలో పాములు అసలు కనిపించవు. న్యూజిలాండ్‌లో(newzealand) పాములు ఉండవట! అలాగే గ్రీన్‌ల్యాండ్‌లో(greenland) కూడా! మన దేశంలో కూడా పాములు కనిపించని చోటు ఒకటుందని మీకు తెలుసా? అదెక్కడ అంటే కేంద్రపాలిత ప్రాంతమైన లక్ష ద్వీప్‌(lakshadweep). అక్కడ చూద్దామన్నా ఒక్క పాము కనిపించదు. అన్నట్టు అక్కడ కుక్కలు(dogs) కూడా ఉండవట! లక్ష ద్వీప్‌కు వెళ్లే టూరిస్టులు కూడా కుక్కలు పట్టుకుని వెళ్లకూడదు. కుక్కతో పాటు వెళితే అక్కడి రానివ్వరు. మొత్తంమీద పాము, కుక్క రహిత ప్రదేశంగా లక్షద్వీప్ పేరు సంపాదించింది.

Eha Tv

Eha Tv

Next Story