నీళ్లున్న చోటే నాగరికత వెల్లివిరిస్తుంది. నీళ్లున్న చోటకే మనుషులు వలస వెళుతుంటారు. నీళ్లున్న చోటనే నివాసాలు ఏర్పరచుకుంటారు. మనిషి మనుగడకు నీరే ముఖ్య అవసరం. అందుకే నీరు పుష్కలంగా లభించే ప్రాంతాలనే మనిషి ఇష్టపడుతుంటాడు. అక్కడే ఇళ్లు కట్టుకుని స్థిరపడాలని అనుకుంటాడు. అలాగే పశ్చిమ ఆఫ్రికాలోని(West Africa) కామెరూన్‌(Cameron) ప్రజలు కోరుకున్నారు. ఆ కోరికే వారి పాలిట శాపంగా మారింది.

నీళ్లున్న చోటే నాగరికత వెల్లివిరిస్తుంది. నీళ్లున్న చోటకే మనుషులు వలస వెళుతుంటారు. నీళ్లున్న చోటనే నివాసాలు ఏర్పరచుకుంటారు. మనిషి మనుగడకు నీరే ముఖ్య అవసరం. అందుకే నీరు పుష్కలంగా లభించే ప్రాంతాలనే మనిషి ఇష్టపడుతుంటాడు. అక్కడే ఇళ్లు కట్టుకుని స్థిరపడాలని అనుకుంటాడు. అలాగే పశ్చిమ ఆఫ్రికాలోని(West Africa) కామెరూన్‌(Cameroon) ప్రజలు కోరుకున్నారు. ఆ కోరికే వారి పాలిట శాపంగా మారింది. పశ్చిమ ఆఫ్రికాలోని వాయువ్య కామెరూన్‌లో న్యోస్‌(Nyos) అనే మంచి నీటి సరస్సు. నిశ్చలంగా, నిర్మలంగా ఉన్న ఆ సరస్సు చుట్టూ పల్లెలు వెలిశాయి. పల్లెలు గ్రామాలుగా మారాయి. ఇన్నేళ్లలో ఆ సరస్సు ఎప్పుడూ పొంగి గ్రామాల మీదకు రాలేదు. పూర్తిగా ఎండిపోయి నీటి ఎద్దడిని తీసుకురాలేదు. అయినా ఆ సరస్సు అయిదు వేల ప్రాణాలను బలి తీసుకుంది.

అది 1986, ఆగస్టు 21. సరస్సు చుట్టూ ఉన్న మూడు గ్రామాల ప్రజలు గాఢ నిద్రలో ఉన్నారు. ఆ రాత్రి వారి పాలిన కాళరాత్రిగా మారుతున్న సంగతి నిద్రలో ఉన్నవారికి తెలియదు.. పడుకున్నవారు పడుకున్నట్టే ఊపిరి వదిలారు. మనుషులే కాదు, సమస్త జీవరాశులు విగత జీవుల్లా మారిపోయాయి. తెల్లవారు జామున ఎక్కడ చూసినా శవాలే.. కళేబరాలే! మంచం మీద ఉన్నవారు మంచం మీద.. బయట ఉన్నవారు బయటే నిర్జీవంగా మారిపోయారు. నోరు లేని పశుపక్ష్యాదులు ప్రాణాలు విడిచాయి. వేళ్ల మీద లెక్కపెట్టేంత మంది మాత్రం ప్రాణాలతో మిగిలారు. శవాల మధ్య బిక్కుబిక్కుమంటూ కనిపించారు. గ్రామంలో స్మశాన నిశ్శద్దం ఆవరించింది. ఆ భయానక దృశ్యాన్ని చూసిన కొందరికి మతి భ్రమించింది. ఏడుస్తూ పిచ్చిపట్టినట్టు బట్టలు చింపుకుని వింతగా ప్రవర్తించారు కొందరు.

'ఆ రాత్రి తొమ్మిది గంటలకు ఆకస్మాత్తుగా గాలి స్తంభించింది. ఏదో ఘాటైన వాసన ముక్కుపుటాలకు తాకింది. ఏదో జరుగబోతున్నదని తెలుస్తున్నది కానీ.. అదేమిటో పసికట్టలేకపోయాం. తర్వాత స్పృహ కోల్పోయాం' అని భీతిల్లుతూ చెప్పుకొచ్చారు. వారి కళ్లలో ఇంకా భయం ఉంది. చనిపోయిన వారి నోటి నుంచి, ముక్కు నుంచి రక్తం కారింది. ఈ ఘోర విపత్తులో 1,746 మంది ప్రజలతో పాటు మూడున్నర వేల జంతువులు, పక్షులు చనిపోయాయి. రాత్రికి రాత్రి ప్రాణాలు తీసేసిన ఆ మృత్యు వపనం అగ్నిపర్వత బిలంలో ఉన్న న్యోస్‌ సరస్సు నుంచే వచ్చిందని తేల్చారు.ఉనికిలో లేని అగ్నిపర్వత బిలం వర్షాల కారణంగా నిండి సరస్సుగా మారింది. నీరు చేరినప్పటికీ బిలంలో జరిగే రసాయనిక చర్య ఆగలేదు. ఆ రాత్రి తొమ్మిది గంటలకు రసాయనిక చర్యల్లో మార్పులు జరిగాయి. ఆ బిలం నుంచి వందల వేల టన్నుల విషపూరిత కార్బన్‌ డై ఆక్సైడ్‌ వెలువడింది. ఆ విషవాయువు వందల కిలోమీటర్ల వరకు వ్యాపించింది. కొన్ని క్షణాల్లోనే అది గ్రామాలకు చుట్టుముట్టింది. పాతిక కిలోమీటర్లుకు పైగా గాలిలో ఆక్సిజన్‌ శాతం పూర్తిగా తగ్గిపోయింది. కార్బన్‌ డై ఆక్సైడ్‌ పీల్చిన వారంతా అక్కడికక్కడే చనిపోయారు.ప్రాణాలతో బయటపడిన వారు మాత్రం సరస్సు నుంచి కుళ్లిన కోడిగుడ్ల వాసన వచ్చిందన్నారు.

ఆ రోజు న్యోస్‌ తటాకంలోని నీళ్లు ఎరుపురంగులోకి మారిపోయాయి. ఈ దుర్ఘటన జరిగిన తర్వాతి రోజు కూడా కొంతమంది చనిపోయారు. 'నీటి అడుగున ఉన్న అగ్ని పర్వత వాయువులు వాటంతట అవే పైకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. న్యోస్‌ బిలంలో చిన్నపాటి భూకంపం సంభవించి ఉంటుంది. చిన్న కదలిక ఏర్పడి ఉంటుంది. అది ఇంత పెద్ద విపత్తుకు కారణమై ఉంటుంది' అని ఈ ఘటనపై పరిశోధనలు చేసిన డేవిడ్‌ బ్రెసెన్స్‌ వివరించారు. ఈ విపత్తు జరగడానికి రెండేళ్ల ముందు, అంటే 1984లో ఇదే ప్రాంతానికి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న మొనౌన్‌ సరస్సు దగ్గర ఇలాంటి దుర్ఘటనే చోటు చేసుకుంది. ఇలాగే కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదలై 37 మంది మరణించారు. అధికారులు అప్పుడే స్పందించి ఉంటే న్యోస్‌ ఘటన జరిగేది కాదని అంటుంటారు చాలా మంది! మరోసారి ఇలాంటి విపత్తు తలెత్తకుండా 2001లో ఇంజనీర్లు న్యోస్‌ సరస్సులో ప్రత్యేకమైన పైపులు ఏర్పాటు చేశారు. మొత్తానికి న్యోస్‌ సరస్సు సృష్టించిన విషాదం ఓ భయంకరమైన పీడకలలా మిగిలిపోయింది.

Updated On 22 Aug 2023 5:06 AM GMT
Ehatv

Ehatv

Next Story