ప‌లు దేశాల్లో మ‌ళ్లీ బ‌ర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది . ఈ కేసులు న‌మోద‌వుతు౦డటంతో దీనిపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న వ్య‌క్తంచేస్తోంది . చాలా కాలం త‌ర్వాత కంబోడియాలో బర్డ్ ఫ్లూతో ఓ బాలిక ప్రాణాలు కోల్పోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. కంబోడియాలోని ప్రే వెంగ్ ప్రావిన్స్ కు చెందిన 11 ఏళ్ల బాలిక హెచ్5ఎన్1 వైరస్ బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ తో మృతి చెందింద‌ని సంబంధిత అధికారులు తెలిపారు. "గ్రామీణ ప్రే వెంగ్ ప్రావిన్స్ కు […]

ప‌లు దేశాల్లో మ‌ళ్లీ బ‌ర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది . ఈ కేసులు న‌మోద‌వుతు౦డటంతో దీనిపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న వ్య‌క్తంచేస్తోంది . చాలా కాలం త‌ర్వాత కంబోడియాలో బర్డ్ ఫ్లూతో ఓ బాలిక ప్రాణాలు కోల్పోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. కంబోడియాలోని ప్రే వెంగ్ ప్రావిన్స్ కు చెందిన 11 ఏళ్ల బాలిక హెచ్5ఎన్1 వైరస్ బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ తో మృతి చెందింద‌ని సంబంధిత అధికారులు తెలిపారు. "గ్రామీణ ప్రే వెంగ్ ప్రావిన్స్ కు చెందిన బాలిక తీవ్ర జ్వరం, దగ్గుతో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆ బాలిక పరిస్థితి విషమించడంతో ట్రీట్మెంట్ కోసం ప్నోమ్ పెన్ లోని జాతీయ బాలల ఆసుపత్రికి తరలించారు . అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెంది౦ది అని అధికారులు తెలిపారు. అయితే ఆమె తండ్రితో పాటు మరో 11 మందికి కూడా ఈ వైరస్ సోకింద‌ని వెల్ల‌డించింది.

అయితే బాలికతో కాంటాక్ట్ అయిన ఇతర వ్యక్తుల పరీక్షల గురించి ఐరాస ఏజెన్సీ కంబోడియన్ అధికారులతో సంప్ర‌దింపులు జ‌రుపుతోంద‌ని డబ్ల్యూహెచ్ వో ఎపిడమిక్ అండ్ పాండమిక్ ప్రిపరేషన్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ సిల్వీ బ్రియాండ్ తెలిపారు. ఇది మనుష్యుల నుంచి మనుష్యులకు వైర‌స్ ఉన్న ప‌రిస‌రాల‌ను నుంచి సైతం వ్యాప్తిచెందుతుంద‌ని తెలిపారు. ఈ వైర‌స్ వ్యాప్తి వేగంగా ఉంటుంద‌ని కూడా ఆయన తెలిపారు .

కంబోడియా ఆరోగ్య అధికారులు ఆ బాలిక గ్రామ౦లో చనిపోయిన పక్షుల నమూనాలను సేకరించారన్నారు . వైరస్ దృష్ట్యా స్థానికులు ముందుజాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. యూఎస్ సీడీసీ ప్రకారం, మానవులలో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా లేదా బర్డ్ ఫ్లూ సంక్రమణ చాలా అరుదైన కేసు, అయితే వైరస్ ఒక వ్యక్తి కళ్ళు, ముక్కు లేదా నోటిలోకి వచ్చినప్పుడు లేదా పీల్చినప్పుడు అంటువ్యాధులు సంభవిస్తాయి. పక్షులు, క్షీరదాల్లో ఇటీవల కేసులు పెరగడం వల్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంద‌ని రాయిట‌ర్స్ నివేదించింది. ఈ వైరస్ ప్రమాదాన్ని డబ్ల్యూహెచ్ వో తీవ్రంగా పరిగణిస్తోందని, అన్ని దేశాల నుంచి అప్రమత్తత పెంచాలని కోరారు.

మరోవైపు భారత్ లోనూ బర్డ్ ఫ్లూ క‌ల‌కలం మొదలయింది . జార్ఖండ్ లో బర్డ్ ఫ్లూతో వందలాది కోళ్లు మృతి చెందడం తో ... అప్రమత్తమైన ప్రభుత్వం చ‌ర్య‌లు చేపట్టింది . బొకారో జిల్లా సెక్టార్ 12లోని లోహంచల్ లో ఉన్న ప్రభుత్వ పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ఫ్లూ బారిన పడి గత ఐదు రోజుల్లో వందలాది కోళ్లు మృతి చెందినట్లు కోల్ కతా ల్యాబ్ ధృవీకరించింది. బొకారో జిల్లాలోని ప్రభుత్వ కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో జార్ఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.

Updated On 27 Feb 2023 8:57 AM GMT
Ehatv

Ehatv

Next Story