ఇంటలిజెన్స్ మాజీ(Ex Raw Agent) అధికారి వికాస్‌ యాదవ్‌పై(Vikas Yadav) అమెరికా అభియోగాలు నమోదు చేసింది.

ఇంటలిజెన్స్ మాజీ(Ex Raw Agent) అధికారి వికాస్‌ యాదవ్‌పై(Vikas Yadav) అమెరికా అభియోగాలు నమోదు చేసింది. ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై(Gurpatwant Singh Pannun) హత్యకు(Murder) కుట్ర పన్నిన కేసులో వికాస్ యాదవ్‌పై అమెరికా (America)ఆరోపణలు చేసింది. పన్నూన్ హత్యకు నిఖిల్ గుప్త అనే భారతీయుడిని నియమించినట్లు వికాస్ యాదవ్ పై ఆరోపణలు చేశారు. ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ భారతదేశంలో వాంటెడ్ టెర్రరిస్ట్. వికాష్ యాదవ్‌పై హత్య, మనీలాండరింగ్ అభియోగాలు నమోదు చేస్తున్నట్లు అమెరికా న్యాయ శాఖ గురువారం ప్రకటించింది. యుఎస్‌లో నివసిస్తున్న వారి రాజ్యాంగబద్ధంగా సంరక్షించబడిన హక్కులను వినియోగించుకున్నందుకు వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి హింసాత్మక చర్యలను లేదా ఇతర ప్రయత్నాలను FBI సహించదు" అని FBI డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కుట్ర మే 2023లో ప్రారంభమైందని, అప్పుడు భారత ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న వికాస్ యాదవ్ హత్యను అమలు చేయడానికి భారతదేశంలో, విదేశాలలో ఉన్న వ్యక్తులతో కలిసి కుట్ర పన్నారని అభియోగాలు నమోదు చేశారు. వికాస్ యాదవ్‌పై మాన్‌హాటన్‌లోని ఫెడరల్ కోర్టులో ఛార్జ్ షీట్ ఓపెన్ చేసింది. ఇది అమెరికన్ గడ్డపై హత్యా ప్రణాళికకు మధ్య భారత ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఆరోపించింది. ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ ఒక అమెరికన్-కెనడియన్ పౌరుడు. అతను సిక్కు ఫర్ జస్టిస్ కోసం పని చేసిన ఖలిస్తాన్ మద్దతుదారుడు. నవంబర్ 29, 2023న న్యూయార్క్‌లోని తన సొంత కార్యాలయంలో పన్నూని చంపడానికి కుట్ర పన్నినట్లు యుఎస్ అధికారులు పేర్కొన్నారు. భారత మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఈ కుట్ర పన్నారని ఆరోపించారు.

ఇది ఇలా ఉండగా వికాస్‌ యాదవ్‌ కేసుపై విదేశీ వ్వవహారాలశాఖ మంత్రిత్వశాఖ స్పందించింది. సదరు వ్యక్తితో భారత ప్రభుత్వంతో సంబంధం లేదని తెలిపింది. ఎఫ్‌బీఐ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఇంటర్-ఏజెన్సీ బృందంతో భారత ప్రతినిధి బృందం సమావేశమైందని యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ నిన్న ధృవీకరించారు. భారత్‌ సహకారంతో సంతృప్తి చెందామని మిల్లర్ విలేకరులతో అన్నారు.

Eha Tv

Eha Tv

Next Story