గన్‌ కల్చర్‌కు అమెరికా(America) ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ యువత మాత్రం తుపాకులను వదలడం లేదు. సోమవారం చికాగో నగరంలో ఓ దుండగుడు కాల్పులు జరిపి ఏడుగురిని పొట్టనపెట్టుకున్నాడు. ఇతడు రెండు చోట్ల కాల్పులు జరిపి పరారయ్యాడు. ఇల్లానాయిస్‌ స్టేట్‌ చికాగో జోలియట్ ప్రాంతంలో సోమవారం ఈ ఘోరం జరిగింది.

గన్‌ కల్చర్‌కు అమెరికా(America) ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ యువత మాత్రం తుపాకులను వదలడం లేదు. సోమవారం చికాగో నగరంలో ఓ దుండగుడు కాల్పులు జరిపి ఏడుగురిని పొట్టనపెట్టుకున్నాడు. ఇతడు రెండు చోట్ల కాల్పులు జరిపి పరారయ్యాడు. ఇల్లానాయిస్‌ స్టేట్‌ చికాగో జోలియట్ ప్రాంతంలో సోమవారం ఈ ఘోరం జరిగింది. బాధిత కుటుంబాల ఇళ్లలోకి చొరబడి మరీ ఆ దుండగుడు కాల్పులు జరిపాడు. ఘటనల్లో రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. కాల్పులకు తెగబడిన వ్యక్తి 23 ఏల్ల రోమియో నాన్స్‌గా పోలీసులు గుర్తించారు. బాధిత కుటుంబాలకు అతడు పరిచయస్తుడు అయిఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
కాల్పులు జరిపిన తర్వాత రోమియో నాన్స్‌ కారులో పరారు అయ్యాడు. ఆ ఉన్మాది మరిన్ని ప్రాణాలు తీయకమునుపే అతడిని పట్టుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు ఎఫ్‌బీఐ సంబంధిత టాస్క్‌ఫోర్స్‌ ఆ ఉన్మాది కోసం గాలింపు చేపట్టాయి.

Updated On 23 Jan 2024 1:15 AM GMT
Ehatv

Ehatv

Next Story