పారిస్ ఒలింపిక్స్‌లో(Paris olympics) ఓ వివాదాస్పద సంఘటన జరిగింది.
పారిస్ ఒలింపిక్స్‌లో(Paris olympics) ఓ వివాదాస్పద సంఘటన జరిగింది. అల్జీరియా బాక్సర్ ఇమేని ఖాలిఫ్ (Imane Khalif)ఈ వివాదానికి కేంద్ర బిందువు. ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్(Female boxing) ఈవెంట్‌లో గురువారం ఇటలీకి(0 చెందిన ఏంజలా కారినితో ఇమేని ఖాలిఫ్ తలపడింది. ఈ పోరు కేవలం 46 సెకన్లలోనే ముగిసింది. ఆ పోటీ నుంచి తాను తప్పుకుంటున్నానని కారిని ప్రకటించడంతో మ్యాచ్‌ను ఆపేశారు. ప్రాణాలు కాపాడుకోవడం కోసమే తాను పోటీ నుంచి వైదొలిగానని కారిని ప్రకటించడంతో ఇమేని ఖాలిఫ్ జెండర్‌పై(Gender) అనుమానాలు వచ్చాయి. నిరుడు జరిగిన ఛాంపియన్‌షిప్ పోటీల నుంచి ఇదే కారణంతో డిస్‌క్వాలిఫై(disqualify) అయ్యారు ఇమేని ఖాలిఫ్. జెండర్ ఇష్యూ వల్లే ఆమెను పోటీ నుంచి తప్పించారు. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌లో కూడా అదే జరిగింది. ఆమె ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇదేం మొదటిసారి కాదు. టోక్యో ఒలింపిక్స్ కూడా పాల్గొంది. అల్జీరియాలోని తియారెట్‌లో జన్మించారు 25 ఏళ్ల ఇమేని ఖాలిఫ్. ఆమె యూనిసెఫ్ అంబాసిడర్ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. అమ్మాయిలు బాక్సింగ్‌లో పాల్గొనడం ఖాలిఫ్ తండ్రికి ఇష్టం లేదు. కానీ ఇమేని ఖాలిఫ్‌కు మాత్రం భారీ టోర్నీల్లో గోల్డ్ మెడల్ గెలవాలనే కోరిక ఉంది. 2023 వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇమేని ఖాలిఫ్‌పై మొదటిసారి లింగ్ ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంతోనే ఢిల్లీలో జరిగిన ఆ ఈవెంట్ నుంచి ఆమెను నిషేధించారు. ఆమెకు నిర్వహించిన డీఎన్ఏ టెస్టు ద్వారా ఆమెకు ఎక్స్‌వై క్రోమోజోమ్‌లు ఉన్నట్లు తేలింది. పురుషుల క్రోమోజోమ్‌లు ఇమేనిలో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2018 వరల్డ్ చాంపియన్‌షిప్ ద్వారా ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అడుగుపెట్టిన ఖాలిఫ్ ఆ టోర్నమెంట్‌లో 17వ స్థానంలో నిలిచారు. ఆ మరుసటి ఏడాది 19వ స్థానంలో నిలిచారు. తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె పోటీపడింది. క్వార్టర్స్‌లో కెల్లీ చేతిలో ఓడిపోయింది. 2022 ఆఫ్రికన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్నది. ఖాలిఫ్ పాస్‌పోర్టుపై ఫిమేల్ అని రాసి ఉందని, అందుకే ఆమె మహిళల క్యాటగిరీలోని 66 కేజీల విభాగంలో పోటీపడుతున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రతినిధి మార్క్ ఆడమ్స్ అంటున్నారు.
ఐఓసీ వ్యక్తం చేసిన అభిప్రాయం సరైంది కాదని మాజీ మహిళా బాక్సర్లు క్లారెసా షీల్డ్, ఎబేని బ్రిడ్జ్‌స్ చెప్పారు. అల్జీరియా ఒలింపిక్ కమిటీ మాత్రం బాక్సార్ ఇమేని ఖాలిఫ్‌కు సపోర్ట్‌గా నిలిచింది.