అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు(Joe Bidden) కరోనాCorona) పాజిటివ్‌ వచ్చింది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు(Joe Bidden) కరోనాCorona) పాజిటివ్‌ వచ్చింది. ఆయన దగ్గు, జలుబు, స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారని వైట్‌ హౌస్‌(white House) సెక్రటరీ కరీన్‌ జీన్‌ పియర్‌ తెలిపారు. అంతేకాదు ఈ విషయాన్ని జో బైడెనే స్వయంగా సోషల్‌ మీడియాలో ప్రకటించారు కూడా. బైడెన్ ప్రస్తుతం డెలావేర్ సముద్ర తీరంలో ఉన్న తన ఇంట్లో ఐసోలేషన్‌ ఉన్నట్లు తెలిపారు. ఆయన కరోనా చికిత్స తీసుకుంటున్నారని, అక్కడి నుంచే బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా జోబైడెన్ ట్వీట్‌(Tweet) చేస్తూ ఈరోజు మధ్యాహ్నం నేనే కోవిడ్-19 టెస్టు చేయించుకున్నా. అందులో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నా. నా శ్రేయస్సు కోరుకునేవారందరికీ ధన్యవాదాలు.. నేను కోలుకునేవరకు అందరికీ దూరంగా ఉంటా, ఈ సమయంలో కూడా అమెరికా ప్రజల కోసం పనిచేస్తానని ఎక్స్‌లో తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లాస్‌వెగాస్‌లో ఓ సదస్సులో పాల్గొన్నారు. ప్రసంగం కంటే ముందే పరీక్ష చేయించుకోగా అందులో పాజిటివ్‌ అని తేలడంతో వెంటనే ఆయన ఇంటికి చేరుకున్నారు. బైడెన్‌కు పాక్స్‌లోవిడ్‌ యాంటీ వైరస్‌ డ్రగ్‌ ఇచ్చినట్లు జీన్‌ పియర్‌ తెలిపారు.

Eha Tv

Eha Tv

Next Story