ఈ వరుస దాడులపై వైట్ హౌస్ తాజాగా స్పందించింది. ఈ దాడులను తీవ్రంగా ఖండించింది

అమెరికాలోని భారత సంతతి వ్యక్తులపై వరుస దాడులు జరుగుతూ ఉన్నాయి. వాషింగ్టన్ డీసీలో ఫిబ్రవరి 2న అర్ధరాత్రి జరిగిన దాడిలో 41 ఏళ్ల ఎన్నారై వివేక్ తనేజా దారుణ హత్యకు గురయ్యాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. షికాగోలో ఫిబ్రవరి 4న మరో ఘటనలో హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మజర్ అలీపై కొందరు దాడి చేసి అతడి ఫోన్, వ్యాలెట్ దోపిడీ చేశారు. ఓహాయోలోని సన్సినాటీ నగరంలోని శ్రేయాస్ రెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పలువురు భారతీయులపై వరుస దాడుల కారణంగా అక్కడున్న ఎన్నారైలు కలవరానికి గురవుతున్నారు. అంతేకాకుండా ఇంకా చాలా మంది అదృశ్యం కూడా అయ్యారు. వారి ఆచూకీ కోసం బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నాయి.

ఈ వరుస దాడులపై వైట్ హౌస్ తాజాగా స్పందించింది. ఈ దాడులను తీవ్రంగా ఖండించింది అమెరికా అధ్యక్ష కార్యాలయం. అమెరికాలో జాతివివక్షకు, హింసకు తావు లేదని తెలిపింది. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా మండలిలోని స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ విభాగం కోఆర్డినేటర్ జాన్ కర్బీ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. భారతీయులపై దాడులపై విలేకరులు అడిగిన ప్రశ్నలపై ఆయన స్పందించారు. జాతి, ప్రాంతం, స్త్రీపురుష బేధాలు సహా మరే ఇతర కారణాలతో జరిగే దాడులైనా క్షమార్హం కాదని జాన్ కర్బీ పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం ఈ దాడులను ఖండిస్తోందని తెలిపారు. వీటిని అరికట్టేందుకు బైడెన్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

Updated On 15 Feb 2024 10:19 PM GMT
Yagnik

Yagnik

Next Story