అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మళ్లీ పాత పాటే పాడారు. తాను ఎలాంటి అనైతిక ఆర్దిక ఒప్పందాలు చేసుకోలేదన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ను తిట్టిపోశారు. బైడెన్‌ పాలన అమెరికాకు నరకప్రాయంగా మారుతోందని అన్నారు. అసలు అమెరికాలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఈ దేశాన్ని ధ్వంసం చేయాలనుకునేవారి నుంచి ధైర్యంగా రక్షించుకోవడమే తాను చేసిన తప్పు అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump)మళ్లీ పాత పాటే పాడారు. తాను ఎలాంటి అనైతిక ఆర్దిక ఒప్పందాలు చేసుకోలేదన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ను(Joe Biden) తిట్టిపోశారు. బైడెన్‌ పాలన అమెరికాకు నరకప్రాయంగా మారుతోందని అన్నారు. అసలు అమెరికాలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఈ దేశాన్ని ధ్వంసం చేయాలనుకునేవారి నుంచి ధైర్యంగా రక్షించుకోవడమే తాను చేసిన తప్పు అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. మనం ఇప్పుడు అమెరికా చరిత్రలోనే అత్యంత చీకటికాలంలో జీవిస్తున్నామని, దేశం క్షీణ దశలో ఉందని తెలిపారు. అఫ్గనిస్తాన్‌(Afghanistan) నుంచి బలగాల ఉపసంహరణ నిర్ణయంతో నవ్వులపాలయ్యామని, ప్రపంచం మనల్ని చూసి నవ్వుతోందని ట్రంప్‌ అన్నారు. అతివాద వామపక్షాలు తనను అణచివేయాలని చూస్తున్నాయని, ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలని అనుకుంటున్నాయని ట్రంప్‌ చెప్పారు. అలాంటి చర్యలను సమర్థంగా అడ్డుకుంటామని, అమెరికాను మళ్లీ ఉన్నతస్థాయిలో నిలబెడతామని ట్రంప్‌ తెలిపారు.
పోర్న్‌ స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌తో(Stormy Daniels) పెట్టుకున్న వివాహేతర సంబంధం బయటపడకుండా ఉండేందుకు అనైతిక ఆర్ధిక ఒప్పందం చేసుకున్నారన్నది ట్రంప్‌పై వచ్చిన అభియోగం. అలాగే వ్యాపార లావాదేవీలకు సంబంధించిన మోసాలకు పాల్పడినట్టు తేలింది. మొత్తం ఆయనపై 34 నిందారోపణలు నమోదయ్యాయి. ట్రంప్‌పై నమోదైన నేరాభియోగాలను న్యాయమూర్తి చదివి వినిపించారు. పోర్న్‌ స్టార్‌తో పాటు ఓ ప్లేబాయ్‌ మాజీ మోడల్‌తో సంబంధంతో బయట పడకుండా ఉండేందుకు ట్రంప్‌ చేసుకున్న అనైతిక ఒప్పందాలే ఆయన్ని ఇలా ఇరకాటంలో పడేశాయి.

స్టార్మీ డేనియల్స్‌(Stormy Daniels) అనే ఓ పోర్న్‌స్టార్‌ (ఇప్పుడు కాదులేండి) 2006లో నెవడాలోని సెలబ్రిటీ గోల్ఫ్‌ టోర్నమెంట్‌(Celebrity Golf Tournament) సందర్భంగా మొదటిసారి ట్రంప్‌ను కలుసుకుంది. అప్పుడామె వయసు 27 ఏళ్లు.. ట్రంపేమో షష్టిపూర్తి చేసుకున్నారు. ట్రంప్‌ ఆమె మోహంలో పడ్డారు. టీవీ షోలో ఓ పాత్ర కోసం లాస్‌ ఏంజిలిస్‌లోని తన బేవర్లీ హిల్స్‌ ఇంట్లో కలవాల్సిందిగా స్టార్మీ డేనియల్స్‌కు కబరుపంపారు ట్రంప్‌. ఆమె వచ్చింది. ఇద్దరూ కలిసి డిన్నర్‌ చేశారు. తర్వాత శృంగారంలో పాల్గొన్నారు. ట్రంప్‌తో సంబంధం ఉన్న విషయాన్ని 2011లోనే ఓ ఇంటర్వ్యూలో డేనియల్స్‌ బయటపెట్టారు. ఈ విషయాన్ని అప్పుడెవరూ పెద్దగా పట్టించుకోలేదు. 2106 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె ఎక్కడ మళ్లీ ఈ విషయాన్ని చెబుతుందేమోనన్న భయంతో ఆమెతో ఓ ఒప్పందం చేసుకున్నారు ట్రంప్‌. డబ్బు ఇచ్చి ఆమెను మాట్లాడకుండా చేశారు. తన వ్యక్తిగత లాయర్‌ మైకేల్‌ కోహెన్‌తో డేనియల్స్‌కు లక్షా 30 వేల డాలర్లను అందించారు. దాంతో ఆమె మారు మాట్లాడకుండా ఉండిపోయింది. ఆ ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధించారు. రెండేళ్ల తర్వాత డేనియల్స్ మళ్లీ పెదవి విప్పారు. 2018 జనవరిలో ఓ ఇంటర్నేషనల్‌ మీడియాకు ఇచ్చన ఇంటర్వ్యూలో ట్రంప్‌తో తనకు ఉన్న సంబంధాన్ని బయటపెట్టారు. అప్పుడు ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. దాంతో ఇది హైప్రొఫైల్‌ కేసు అయ్యింది. ఆమె ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ట్రంప్‌ను కేసు నుంచి బయటపడేసేందుకు కోహెన్‌ అది తన సొంత డబ్బు అని, ట్రంప్‌కు ఎలాంటి సంబంధమూ లేదని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. 2018 ఆగస్టులో కోహెన్‌ తన నేరాన్ని అంగీకరించారు. ట్రంప్‌ ప్రచార నిధి నుంచే ఆ డబ్బును చెల్లించినట్టు కోహెన్‌ ఒప్పుకున్నారు. దీంతో కోహెన్‌కు మూడేళ్ల శిక్ష విధించించి కోర్టు. అదే ఏడాది ఫుల్‌ డిస్‌క్లోజర్‌ అనే పుస్తకంలో ట్రంప్‌తో తనకున్న సెక్సువల్‌ రిలేషన్‌షిప్‌ను డిటైల్డ్‌గా చెప్పారు డేనియల్స్‌. 2019 ఆగస్టులో మాన్‌హట్టన్‌ డిస్ట్రిక్‌ అటార్నీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అనైతిక ఒప్పందం చెల్లింపులకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని ట్రంప్‌ను ఆదేశించారు. అనైతిక ఒప్పందం ద్వారా పన్నుల కుంభకోణానికి ట్రంప్‌ పాల్పడ్డారంటూ ట్రంప్‌ కంపెనీపై అభియోగం నమోదయ్యింది. 2023, జనవరిలో గ్రాండ్‌ జ్యూరీకి ట్రంప్‌ అనైతిక ఒప్పందానికి సంబంధించిన ఆధారాలు సమర్పించారు. గ్రాండ్‌ జ్యూరీ ఎదుట హాజరుకావాలని ట్రంప్‌ను ఆదేశించినా ఆయన పట్టించుకోలేదు. 2023 మార్చి చివరి వారంలో మాన్‌హట్టన్‌ డిస్ట్రిక్‌ అటార్నీ ట్రంప్‌పై అభియోగాల నమోదు దిశగా సంకేతాలు ఇచ్చింది. ఇక లాభం లేదనుకున్న ట్రంప్‌ లొంగిపోవడానికి నిర్ణయించుకున్నారు.

కోర్టు ఆయనపై నేరాభియోగాలు మోపడానికి, అరెస్ట్‌కు ఆదేశాలు ఇవ్వడానికంటే ముందే మాన్‌హట్టన్‌ కోర్టులో లొంగిపోవడానికి ట్రంప్‌ వెళ్లారు. కానీ పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత లీగల్‌ టీమ్‌తో కలిసి కోర్టు విచారణలో ట్రంప్‌ పాల్గొన్నారు. గంటసేపు రెండు వర్గాల మధ్య వాదనలు జరిగాయి. ఆ తర్వాత ట్రంప్‌ బయటకు వచ్చారు. ఫ్లోరిడాలోని తన ఇంటికి వెళ్లారు. డిసెంబర్‌ నాలుగున ఈ కేసుకు సంబంధించి మళ్లీ ట్రంప్‌ విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఇక ఇండియానాకు చెందిన 52 ఏళ్ల నటి, మోడల్‌ మెక్‌డగల్‌ కూడా ఇంచుమించు ఇలాంటి ఆరోపణలనే చేశారు. 9వ దశకంలో ప్లేబాయ్‌ మ్యాగజైన్‌ కోపం పని చేసింది కూడా. 2006-07 టైమ్‌లో ట్రంప్‌ తనతో సంబంధం పెట్టుకున్నారని, అది బయటపడకుండా ఉండేందుకు తనకు డబ్బు ఇచ్చారని ఆమె చెప్పింది. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఓ మీడియా సం‍స్థ ద్వారా లక్షా యాభై వేల డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్న మెక్‌డగల్‌ ఈ విషయాన్ని మాన్‌హట్టన్‌ డిస్ట్రిక్‌ అటార్నీ ముందు అంగీకరించింది. అయితే ట్రంప్‌పై వస్తున్న ఆరోపణలు ఆయన అధ్యక్ష ఎన్నిక అభ్యర్థిత్వంపై ప్రభావం చూపకపోవచ్చంటున్నారు న్యాయ నిపుణులు. ఒకవేళ ట్రంప్‌ దోషిగా తేలి శిక్షపడినా ప్రొబేషన్‌ శిక్షనే ఎదుర్కొంటారు తప్ప ట్రంప్‌కు ఇబ్బంది ఉండదని వారంటున్నారు.

Updated On 6 April 2023 2:08 AM GMT
Ehatv

Ehatv

Next Story