Israel National Flag : ఇజ్రాయెల్ జెండాలో ఉన్న బ్లూస్టార్ రహస్యం ఏమిటి? యూదులను అది ఎలా రక్షిస్తుంది?
ఇజ్రాయెల్(Israel)-హమాస్(Hamas) మిలిటెంట్ల మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. హమాస్ మిటిలెంట్ల అంతు చూసేంత వరకు ఇజ్రాయెల్ యుద్ధం ఆపేలా లేదు. ఈ క్రమంలో ప్రపంచం రెండుగా చీలింది. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చే దేశాలు ఓవైపు, పాలస్తీనా అండగా నిలుస్తున్న దేశాలు మరోపక్క నిలిచాయి
ఇజ్రాయెల్(Israel)-హమాస్(Hamas) మిలిటెంట్ల మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. హమాస్ మిటిలెంట్ల అంతు చూసేంత వరకు ఇజ్రాయెల్ యుద్ధం ఆపేలా లేదు. ఈ క్రమంలో ప్రపంచం రెండుగా చీలింది. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చే దేశాలు ఓవైపు, పాలస్తీనా అండగా నిలుస్తున్న దేశాలు మరోపక్క నిలిచాయి. ఇదే సమయంలో ఇజ్రాయెల్ జెండా(Israel National Flag) ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలలో ఎక్కువగా కనిపిస్తోంది. ఆ జెండాను జాగ్రత్తగా చూసేవారు అందులో నీలిరంగు స్టార్‌ను(Blue Star) గమనించే ఉంటారు. ఆ నక్షత్రాన్ని డేవిడ్(David) అని పిలుస్తారు. 14వ శతాబ్దం మధ్యకాలం నుంచి యూదులు తమ జెండాపై ఈ గుర్తును ఉపయోగించసాగారు. అసలు యూదులు అంటే ఎవరు? ఇజ్రాయెల్ దేశం ఎలా ఏర్పడింది? ఇజ్రాయెల్ దేశం పుట్టకమునుపు యూదులు(jews) ఎక్కడ ఉండేవారు ? ఇలాంటి సందేహాలు చాలా మందికి వచ్చాయి . సందేహాల నివృత్తి కోసం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో శోధించేవారు ఎక్కువయ్యారు. ఇదే విధంగా కొందరు జుడాయిజం(Judaism) గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇజ్రాయెల్ జెండాపై ఉన్న బ్లూ స్టార్ విషయానికి వస్తే యూదులు ఈ గుర్తును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నీలి నక్షత్రంతో వారి చరిత్రకు విడదీయరాని అనుబంధం ఉంది. 14వ శతాబ్దం నుంచే జెండాపై నీలి నక్షత్రం వచ్చింది. తర్వాతి కాలంలో ఇది యూదుల మత చిహ్నంగా మారింది. దీంతో పటు 1896లో జియోనిస్ట్ ఉద్యమ మొదలైనప్పుడు ఈ జెండాను యూదులు చేతబబట్టారు. అధికారికంగా 1948, అక్టోబర్ 28న ఇజ్రాయెల్ జెండాగా మారింది. ప్రళయ కాలంలో ఈ నక్షత్రం తమను కాపాడుతుందని యూదులు విశ్వసిస్తారు. అందుకే ఈ స్టార్‌ను డేవిడ్ షీల్డ్ అని కూడా పిలుస్తారు. మూడున్నర వేల సంవత్సరాల కిందటే యూదులు ఈ బ్లూ స్టార్‌ను స్వీకరించారని కొందరు అంటుంటారు. హిబ్రూ, ఇజ్రాయెల్ బానిసలు తాము ఈజిప్టు బానిసత్వం నుండి విముక్తి పొందినప్పుడు ఈ నక్షత్రాన్ని స్వీకరించారట! రెండు త్రిభుజాల కలయికతో ఈ నక్షత్రం రూపుదిద్దుకుంది. కిందనున్న త్రిభుజం డేవిడ్ రాజు చిహ్నం అని, పైన ఉన్న త్రిభుజం డేవిడ్ పట్టుకున్న డాలు అని చెబుతారు.