Nusa Peda Island : దెయ్యాల దీవి.. అక్కడికి వెళ్తే ఇక అంతే అట..!
ప్రపంచంలో చాలా పర్యాటక ప్రదేశాలు అత్యంత సుందరంగా ఉంటాయి.
ప్రపంచంలో చాలా పర్యాటక ప్రదేశాలు అత్యంత సుందరంగా ఉంటాయి. దేశవిదేశాల నుంచి పర్యాటకులు అలాంటి పర్యాటక ప్రదేశాలకు వెళ్లి సేద తీరుతుంటారు. ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదిస్తూ సమయాన్ని గడుపుతుంటారు. అయితే ఓ దివి చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. సముద్రం కూడా నీలి రంగులో చాలా అందంగా కనపడుతుంది. కానీ అక్కడికి వెళ్లొద్దని మాత్రం స్థానికులు చెప్తారు. ఎక్కడా దీవి.. ఏమా కథ..?
ఇండోనేసియా(Indonesia) ప్రపంచ పర్యాటక దేశాల్లో ఇండోనేసియా కూడా ఒకటి. ఇక్కడ బాలి(Bali) అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. అయితే బాలి నుంచి గంట ప్రయాణం తర్వాత మరో దీవి(Island) ఉంది. దీనికి వెళ్లాలంటే మాత్రం స్థానికులు మనల్ని భయభ్రాంతులకు గురిచేస్తారు. దాని అడ్రెస్ అడిగితే మనల్ని వింత మనిషిలా చూస్తారు. ఆ దివి పేరే నుసా పెనిడా(Penida). ఇక్కడ ప్రేతాత్మలు తిరుగుతాయని స్థానికుల నమ్మకం. అక్కడికి వెళ్లిన వారిని ప్రేతాత్మలు పట్టిపీడిస్తాయని వారి నమ్మకం. ఇక్కడ ప్రదేశం వేడిగా ఉన్న సముద్రగాలులు బాగా వీస్తాయి. నిజానికి ఈ దీవి చాలా అందంగా ఉంటుంది. చుట్టూ సముద్రం, మధ్యలో కొండలు, వాటిపై దట్టమైన అడవులు, పచ్చదనంతో ఆకట్టుకుంటుంది. గతంలో ఓ పర్యాటకురాలు ఇక్కడికి వెళ్లి స్కూబా డైవింగ్ చేస్తుండగా ఎవరో తన కాళ్లు పట్టుకొని లాగినట్లు అనిపించింది అట. తర్వాత వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవరూ లేకపోవడంతో.. భయపడిపోయి తిరిగి వచ్చేసిందని చెప్తారు. ఒకవేళ ఈ దీవికి వెళ్లాలంటే ఒంటిపై పవిత్ర జలాలు తీసుకొని వెళ్లాలని చెప్తుంటారు.
అయితే ఈ నుసా పెనిడా(Nusa Penida) దీవిలో దయ్యాలు, చేతబడులు(Black magic) చేసేవారుండేవారట. పురాణకాలంలో జెరో గెడె మకాలింగ్ అనే అతను చేతబడులు చేయడంలో ఫేమస్ అంటారు. అతడు బాలిలో వ్యాధులను వ్యాపింపజేసేవాడని, బాలిలో అనారోగ్య కారణాలకు మకాలింగ్ చేతబడులే కారణమని నమ్మి అతన్ని బాలి నుంచి తరిమేశారని చెప్తారు. బాలిలో కొత్త సంవత్సరాన్ని నైపీ అంటారు. ఓ సారి కొత్త సంవత్సరం వేడుకలు జరుగుతుండగా బాలి ప్రజలు ఎంతో ఆరాధించే బారోంగ్ ఆకారంలోకి మకాలింగ్ ప్రవేశించి బాలికి వచ్చాడు. ఇది గుర్తించని స్థానికులు, ఇది బారోంగ్ జీవే అని అనుకున్నారు. కానీ మకాలింగ్ తన దెయ్యాల సైన్యాన్ని దింపి అసలైన బారోంగ్‌ని చంపేశాడు. దీంతో కొత్త సంవత్సరం వేడుకలు విషాదంగా జరిగాయి.
ఆ కాలం నుంచి ఇప్పటి వరకు ఇక్కడ కొత్త సంవత్సర వేడుకలను నిరాడంబరంగా మాత్రమే చేసుకుంటారట. తర్వాత కాలంలో స్థానికులు మరో బారోంగ్‌ని సృష్టించి మకాలింగ్‌పై యుద్ధానికి పంపగా మకాలింగ్‌పై బారోంగ్ యుద్ధం చేసి మకాలింగ్ దయ్యాల సైన్యాన్ని తరిమివేయడంతో ఈ నుసా పెనిడా అనే దీవికి తరలిపోయాని చెప్తారు. ఆ తర్వాత హిందూ పూజారులు వచ్చి బాలికి దయ్యాలు రాకుండా పలు రకాల పూజలు చేసి మకాలింగ్ దయ్యాల సైన్యాన్ని నుసా పెడా నుంచి బాలికి రాకుండా అడ్డుకున్నారని నమ్ముతారు. నుసా పెనిడా అంటే పూజారులు చేసిన దీవి అని అర్థం. దయ్యాలను పూజారులు నుసా పెనిడా దీవికే పరిమితం చేయడంతో వారి గుర్తుగా బాలి వాసులు ఈ దీవికి నుసా పెనిడా అని పేరు పెట్టుకున్నారట.
నుసా పెనిడాలో పురా పెడ్(Pura Ped) అనే ఆలయం ఉందని అక్కడ మకాలింగ్ ప్రేతాత్మ ఉందని అంటారు. ఈ ప్రేతాత్మ ప్రభావం నుసా పెనిడా దీవిపై ఉందని అంటారు. నుసా పెనిడాలో కూడా కొందరు నివసిస్తున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లు నడుపుతున్నారు. ఇక్కడ ఎవరైనా అనారోగ్యం పాలైతే మకాలింగ్ ప్రేతాత్మ ఉంటున్న ఆలయంగా చెప్పుకునే పురాపెడ్ దగ్గరికి వచ్చి మకాలింగ్‌ను వేడుకుంటారు. మకాలింగ్‌ను వేడుకుంటే వారిని వదిలేయడం ద్వారా అనారోగ్యం నుంచి బయటపడతారని ఇక్కడి స్థానికుల నమ్మకం. అందుకే బాలిలో ఉంటున్నవారు ఈ నుసా పెడా దీవికి వెళ్లొద్దని పర్యాటకులు హెచ్చరిస్తారట. ఇవన్నీ నమ్మని కొందరు మాత్రం నుసా పెడా దీవికి వెళ్లి ఎంజాయ్ చేస్తారని మరో వర్గం వాదన.