M-pox Symptoms : మంకీపాక్స్ (ఎంపాక్స్) లక్షణాలేంటి.. గుర్తించడం ఎలా..?
మంకీపాక్స్(Monkey Pox) ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది.
మంకీపాక్స్(Monkey Pox) ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే 70 దేశాల్లో ఆరోగ్య ఎమర్జెన్సీ(Health Emergency) ప్రకటించారు. ఈ ఏడాది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 530 మంది చనిపోయారని డబ్ల్యూహెచ్‌వో(WHO) తెలిపింది. దీంతో పలు ప్రపంచ దేశాలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రమత్తం చేసింది. ఆఫ్రికా(africa) ఖండంలోని అన్ని దేశాల్లో హెల్త్ ఎమర్జెన్సీని అమలు చేస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఆయా దేశాల్లో విదేశీ పర్యాటకులకు అనుమతిలేదు. ప్రభుత్వాలు ఆరోగ్యంపై అత్యధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనిని ప్రాణాంతక వ్యాధిగా గుర్తించారు. కరోనా(corona) కంటే వేగంగా విస్తరిస్తున్నట్లు అంతర్జాతీయ వైద్యులు వెల్లడించారు. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలకు విస్తరించిందని, ఆసియా ఖండంలోకి కూడా విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మంకీ పాక్స్‌పై భారత్ కూడా అప్రమత్తమైంది. భారత్‌కు వచ్చే ఆఫ్రికన్ల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.మంకీపాక్స్‌ను తొలుత 1958లో కోతులలో గుర్తించారు. అందుకే దీనిని మంకీ పాక్స్ అంటారు. ఇది సోకితే జ్వరం బారిన పడి, క్రమేణా ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎంపాక్స్ సోకినవారిలో రోగనిరోధకశక్తి తగ్గిపోయి ప్రాణాలు వదులుతున్నారు. పాక్స్ సోకిన వ్యక్తి ఉపయోగించిన పరుపు, దుస్తులు ఇతర వస్తువుల ద్వారా ఇది వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. ఇది సోకినవారిపై చర్మంపై గడ్డలు, పొక్కులు ఏర్పడి దురద వస్తుంది. చీము, నెత్తురు పడుతుంది. ఆర్తోపాక్స్ వైరస్ జాతికి చెందినది అంతర్జాతీయ వైద్య బృందం దీనిని గుర్తించింది. మంకీపాక్స్ లక్షణాలు: ఇది సోకితే తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులుంటాయి. మొహం, చేతులు, పాదాలు, శరీరంలోని ఇతర భాగాలపై దద్దుర్లు, గడ్డలు ఏర్పడుతాయి. మొటిమలు వచ్చి వాటిలో చీము చేరుతుంది. తరచుగా జ్వరం వస్తుంది. మంకీపాక్స్‌కు పర్టికులర్‌గా మందులు లేవు. మంకీపాక్స్ వ్యాధి నిర్మూలనకు పరిశోధనలు కొనసాగుతున్నాయి.