బెర్క్‌షైర్ హతావే చైర్మన్‌ కమ్‌ సీఈవో వారెన్‌ బఫెట్‌ ఉదారత గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. ప్రపంచంలోనే పదో అత్యంత సంపన్నుడైన ఆయన మనసు కూడా సంపన్నమే!

బెర్క్‌షైర్ హతావే చైర్మన్‌ కమ్‌ సీఈవో వారెన్‌ బఫెట్‌(Warren Buffett) ఉదారత గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. ప్రపంచంలోనే పదో అత్యంత సంపన్నుడైన ఆయన మనసు కూడా సంపన్నమే! ఇప్పటికే చాలా సొమ్మును విరాళంగా ఇచ్చిన బఫెట్‌ తాజాగా సంపదను విరాళంగా ఇవ్వాలనుకుంటున్న వారెన్‌ బఫెట్‌!5.3 బిలియన్ డాలర్ల విలువైన 1.3 కోట్ల బెర్క్‌షైర్ హతావే స్టాక్స్‌ను బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌(Bill & Melinda Gates Foundation)కు, నాలుగు కుటుంబ ఛారిటీలకు విరాళంగా ఇస్తున్నారు. 2006 తర్వాత బఫెట్‌ ఇస్తున్న అత్యధిక వార్షిక విరాళం ఇదే! వారెన్ బఫెట్ అత్యంత ధనికుడన్న విషయం చాలా మందికి తెలుసు కానీ, ఆయన దాతృత్వం గురించి, విరాళాల గురించి ఎక్కువ మందికి తెలియదు. ఇప్పుడు ప్రకటించిన విరాళంతో కలిపి ఆయన స్వచ్ఛంద సంస్థలకు ఎంతో ఇచ్చారో తెలుసా? అక్షరాల 57 బిలియన్‌ డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 4.7 లక్షల కోట్ల రూపాయలు. గేట్స్ ఫౌండేషన్ కు బఫెట్ ఇప్పటివరకూ 43 బిలియన్ డాలర్లకు పైగా విలువైన బెర్క్ షైర్ షేర్లను విరాళంగా ఇచ్చారు. తన మొదటి భార్య పేరు మీద ఉన్న సుసాన్ థాంప్సన్ బఫెట్ ఫౌండేషన్ కు 9,93,035 షేర్లను, తన పిల్లలు హోవార్డ్, సుసాన్, పీటర్ నేతృత్వంలోని మూడు స్వచ్ఛంద సంస్థలకు కూడా 6,95,122 షేర్లను బఫెట్‌ విరాళంగా ఇచ్చారు. బెర్క్ షైర్‌లో 1965 నుంచి తాను నిర్మించిన సంపదలో 99 శాతానికి పైగా విరాళంగా ఇవ్వాలని 93 ఏళ్ల బఫెట్ అనుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీలునామాను ఆయన తదనంతరం ఆయన పిల్లలు అమలు చేయనున్నారు.

Eha Tv

Eha Tv

Next Story