స్పేస్‌ఎక్స్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ మామూలోడు కాదని, తన కంపెనీలో పని చేసిన ఇద్దరు ఉద్యోగినులతో సెక్స్‌లో పాల్గొన్నాడని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది

స్పేస్‌ఎక్స్‌(twitter) సీఈవో(CEO) ఎలాన్‌ మస్క్‌(Elonmusk) మామూలోడు కాదని, తన కంపెనీలో పని చేసిన ఇద్దరు ఉద్యోగినులతో సెక్స్‌లో పాల్గొన్నాడని వాల్‌స్ట్రీట్‌(Wallstreet) జర్నల్‌ పేర్కొంది. తనతో పిల్లలను కనాలంటూ వారిపై ఒత్తిడి తెచ్చాడని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో ప్రచురితమైన కథనం పేర్కొంది. స్పేస్‌ ఎక్స్‌లో పని చేసి 2013లో అందులోంచి బయటకు వచ్చిన ఓ మహిళ మస్క్ ఎలాంటివాడో చెప్పింది. ప్రపంచ జనాభా సంక్షోభంలో ఉందని, అధిక ఐక్యూ కలిగిన పిల్లలను కనాలని మస్క్‌ చెప్పేవాడట! ఇందుకు సంబంధించి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను కూడా ఆ సంచలన కథనంలో ప్రచురించారు. స్పేస్‌ఎక్స్‌, టెస్లా కంపెనీలలో ఎలాన్‌ మస్క్‌ మహిళా వ్యతిరేక వాతావరణం సృష్టించాడని వాల్‌స్ట్రీట్‌ జర్నల్ పేర్కొంది. అయినా మస్క్‌ మీద ఇలాంటి ఆరోపణలు రావడం ఇది మొదటిసారేం కాదు. ఇంతకు ముందు కూడా మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.

Eha Tv

Eha Tv

Next Story