ఇజ్రాయెల్‌(Israel)-హమాస్‌(Hamas) మధ్య మూడు వారాలుగా యుద్ధం జరుగుతోంది. వేలాది మందిని ఈ యుద్ధం పొట్టనపెట్టుకుంది. చిన్నారులను చిదిమివేస్తోంది. కాగా పాలస్తీనా(Palestine)- ఇజ్రాయెల్ మధ్య ఈ వివాదం కొత్తది కాదు. దశాబ్దాల నాటి శత్రుత్వం అలా కొనసాగుతూనే ఉంది. ఈ పోరాటం ఇజ్రాయెల్ ఏర్పాటుతో ప్రారంభమైంది.

ఇజ్రాయెల్‌(Israel)-హమాస్‌(Hamas) మధ్య మూడు వారాలుగా యుద్ధం జరుగుతోంది. వేలాది మందిని ఈ యుద్ధం పొట్టనపెట్టుకుంది. చిన్నారులను చిదిమివేస్తోంది. కాగా పాలస్తీనా(Palestine)- ఇజ్రాయెల్ మధ్య ఈ వివాదం కొత్తది కాదు. దశాబ్దాల నాటి శత్రుత్వం అలా కొనసాగుతూనే ఉంది. ఈ పోరాటం ఇజ్రాయెల్ ఏర్పాటుతో ప్రారంభమైంది. కొత్తగా పుట్టుకొచ్చిన ఇజ్రాయెల్‌ దేశం నెమ్మదిగా పాలస్తీనా ఆక్రమించడం మొదలుపెట్టింది. ఇప్పుడు పాలస్తీనాను ఇంచుమించు పూర్తిగా కబళించివేసింది. ఈ దురాక్రమణను అంతర్జాతీయ సమాజం చూసి చూడనట్టుగా వ్యవహరించింది. అందుకే ఇజ్రాయెల్ అంటే పాలస్తీనాకు అంత కోపం. ఇదిలా ఉంటే రెండు దేశాల మధ్య ఇంతటి శత్రుత్వం ఉన్నప్పటికీ ఓ గ్రామం మాత్రం అందరినీ ఆకర్షిస్తోంది. ఈ గ్రామంలో ఇజ్రాయెల్‌- పాలస్తీనా ప్రజలు ఎంతో అన్యోన్యంగా, ఐకమత్యంగా మెలుగుతుండటం విశేషం. జెరూసలెం-ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌(Tel Aviv) మధ్య వాల్‌ అల్‌ సలామ్‌(Wal Al Salam) అనే గ్రామం ఉంది. ఈ అరబిక్‌ పదానికి తెలుగులో శాంతి(Peace) ఒయాసిస్‌ అని అర్థం. ఇక్కడ వేలాది మంది యూదులు, పాలస్తీనియన్లు నివసిస్తున్నారు. ఎవరిలోనూ విద్వేషం లేదు. ఒకరికి తోడుగా ఒకరు కలిసిమెలిసి జీవిస్తున్నారు. 70కి పైగా కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. వీరిలో యూదులు ఉన్నారు. అరబ్బులూ ఉన్నారు. శాంతిని, సామరస్యాన్ని కోరుకునేవారు మాత్రమే ఈ గ్రామంలో ఉన్నారు. ఈ గ్రామంలో ఉన్న ఒకే ఒక్క పాఠశాలలో యూదుల పిల్లలు, అరబ్బుల పిల్లలు కలిసే చదువుకుంటారు. మొదట్లో ఇక్కడ నాలుగు కుటుంబాలవారు మాత్రమే ఉండేవారు. తర్వాత చాలా మంది ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. అందుకే గ్రామంలోని జనాభా పెరుగుతూ వస్తోంది. ఏదో ఒక రోజు ఇరుదేశాల్లోని ద్వేషం మాయమై శాంతి వర్థిల్లుతుందని వారు బలంగా విశ్వసిస్తున్నారు. వారి ఆకాంక్ష తీరే రోజు త్వరలో రావాలని కోరుకుందాం!

Updated On 28 Oct 2023 1:33 AM GMT
Ehatv

Ehatv

Next Story