Russia : పని మధ్యలో సెక్స్ చేసుకోండి ప్లీజ్..!
తమ దేశంలో జనాభా(Population) తగ్గిపోతుండడంతో రష్యా(Russia) ప్రభుత్వం దిగాలు చెందుతోంది.
తమ దేశంలో జనాభా(Population) తగ్గిపోతుండడంతో రష్యా(Russia) ప్రభుత్వం దిగాలు చెందుతోంది. దీంతో సంతానోత్పత్తి పెంచేందుకు పలు చర్యలు చేపట్టింది. రోజులు త్వరగా గడిచిపోతున్నాయి.. జీవితం త్వరగా ముగుస్తుంది.. అందుకని పనిచేస్తూ విరామ సమయంలో తమ భాగస్వాములతో శృంగారం(romance) చేసి పిల్లలను కనాలని రష్యా ప్రభుత్వం సూచిస్తోంది. రోజుకు 12-14 గంటలు పనిచేస్తూ సంసార సాగరాన్ని నిర్లక్ష్యం చేయడంతో సంతానోత్పత్తి తగ్గుతుందని, తద్వారా జనాభా రేటు పడిపోయిందని రష్యా ప్రభుత్వం భావిస్తోంది. సంతానాన్ని కనండి.. ప్రోత్సాహకాన్ని అందించండి నగదు ప్రోత్సాహకాన్ని కూడా ప్రకటిస్తున్నారు.
రష్యా జనన రేటులో తగ్గుదల 1999 కంటే కనిష్ట స్థాయికి చేరుకుంది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 2024 మొదటి అర్ధ భాగంలో 16,000 తక్కువ జననాలు నమోదయ్యాయి. అదనంగా, జనాభా క్షీణత 18% వేగవంతమైంది, ఈ సంవత్సరం 49,000 మరణాలు నమోదయ్యాయి, ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ఇది తీవ్రమైంది. 18-40 సంవత్సరాల వయస్సు గల మహిళల పునరుత్పత్తి ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు ఉచిత కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతే కాదు 24 ఏళ్లలోపు మహిళలకు పిల్లలు పుడితే మొదటి సంతానానికి 8500 రూబిల్స్ ప్రోత్సాహంగా అందిస్తారు. అంతేకాకుండా అబార్షన్లపై నియంత్రణ పెట్టారు. విడాకుల రుసుంను కూడా పెంచింది రష్యా ప్రభుత్వం