ఎన్నికల్లో నిల్చునేవారికి ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపించడం బాగా వంటపట్టింది. ఈ విద్యలో భారతీయులే బాగా ఆరితేరారు. అమెరికా అధ్యక్ష పదవి పోటీలో ఉన్న రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి వివేక్‌ రామస్వామి(Vivek Ramaswamy) కూడా ప్రజలకు బోల్డన్నీ హామీలిస్తున్నారు. తాను గెలిస్తే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తానని అన్నారు. అధ్యక్ష పదవి ఎన్నికల బరిలో దిగి మరోసారి ఆ పీఠాన్ని అధిరోహించాలనుకుంటున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కంటే వివేక్‌ రామస్వామి రెండాకులు ఎక్కువ చదివారు.

ఎన్నికల్లో నిల్చునేవారికి ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపించడం బాగా వంటపట్టింది. ఈ విద్యలో భారతీయులే బాగా ఆరితేరారు. అమెరికా అధ్యక్ష పదవి పోటీలో ఉన్న రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి వివేక్‌ రామస్వామి(Vivek Ramaswamy) కూడా ప్రజలకు బోల్డన్నీ హామీలిస్తున్నారు. తాను గెలిస్తే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తానని అన్నారు. అధ్యక్ష పదవి ఎన్నికల బరిలో దిగి మరోసారి ఆ పీఠాన్ని అధిరోహించాలనుకుంటున్న డోనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) కంటే వివేక్‌ రామస్వామి రెండాకులు ఎక్కువ చదివారు.

సీఎన్‌ఎన్‌(CNN) నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో వివేక్‌ రామస్వామి చాలా విషయాలు చెప్పుకొచ్చారు. రష్యా-ఉక్రెయిన్‌(Russia-Ukrain) మధ్య జరుగుతోన్న యుద్ధాన్ని తాను ఆపగలనని, అందుకు రష్యా, చైనాలతో సైనిక సంబంధాలను నిలిపివేయాలని రామస్వామి అన్నారు. అలాగే క్యివ్, డాన్ బాస్ నాటోలో చేరకుండా ఉండాలన్నారు. రష్యాను ఓడించడం తన ఉదేశ్యం కాదని, అమెరికాను గెలిపించడమే తన ఉద్దేశ్యమని రామస్వామి అన్నారు.రష్యా-చైనా కలగలసిన సైన్యం ప్రపంచంలోనే పెద్దదని అది అమెరికాకు ఎప్పటికైనా ప్రమాదమేనని పేర్కొన్నారు. అమెరికా ప్రమేయం పెరిగే కొద్దీ చైనాకు రష్యా మరింత దగ్గరవుతూ ఉంటుందని, ఏ రాజకీయ పార్టీ కూడా ఈ ప్రస్తావన తీసుకురావడం లేదని చెప్పారు.

ఈ సమస్య పరిష్కారానికి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వీలైతే మాస్కోకు వెళతానని అన్నారు. ప్రస్తుతమున్న బైడెన్ ప్రభుత్వం రష్యా- చైనా భాగస్వామ్యాన్ని విడగొట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోందని, అది సాధ్యపడాలంటే మనం మొదటగా పుతిన్ - జిన్ పింగ్ మధ్య గీత గీయాల్సిన అవసరముందని, లేకపోతే 1972లో నిక్సన్‌ ఐనా వెళ్లిన నాటి పరిస్థితులు నెలకొంటాయని
వివేక్‌ రామస్వామి తెలిపారు..తన దృష్టికి పుతిన్ ఈ తరం మావోలా కనిపిస్తున్నారని చెబుతున్న రామస్వామి తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాస్కో వెళ్లి చైనా బిగి కౌగిలి నుంచి రష్యాను విడిపిస్తానని అన్నాడు. తన విదేశీ విధానాలలో ఇదే ప్రధానమైనదని వివేక రామస్వామి వివరించారు.

Updated On 19 Aug 2023 3:15 AM GMT
Ehatv

Ehatv

Next Story