Viv Richards : లారాపై గుర్రుగా ఉన్న రిచర్డ్స్, హూపర్... అసలేమైంది?
వెస్టిండీస్(West indies) మాజీ క్రికెట్ కెప్టెన్, లెజండరీ బ్యాట్స్‌మన్ బ్రియాన్ లారా(Brian Lara) వివాదంలో చిక్కుకున్నాడు.
వెస్టిండీస్(West indies) మాజీ క్రికెట్ కెప్టెన్, లెజండరీ బ్యాట్స్‌మన్ బ్రియాన్ లారా(Brian Lara) వివాదంలో చిక్కుకున్నాడు. దీనికి కారణం తాజాగా అతడు రాసిన పుస్తకమే. లారా : ద ఇంగ్లండ్ క్రానికల్స్ అనే పుస్తకాన్ని రాసిన లారా అందులో కొంతమందిపై లేనిపోని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కింగ్ వివియన్ రిచర్డ్స్, కార్ల్ హూపర్ గురించి కొన్ని కామెంట్లు చేశాడు. ఈ మాటలు వారికి కోపం తెప్పించాయి. తమకు సారీ(Appology) చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. వెస్టిండీస్ జట్టులోని ప్లేయర్లను వివ్ రిచర్డ్స్(Viv Richards) భయపెట్టేవాడని, కొన్ని వారాలకోసారి తనను ఏడిపించేవాడని లారా ఆ బుక్‌లో రాశాడు. తననే కాకుండా కార్ల్ హూపర్‌ను(Clar hooper) కూడా రిచర్డ్స్ ఏడిపించేవాడని చెప్పాడు. వారానికి ఒకసారైనా హూపర్‌ను ఏడ్చేలా చేసేవాడని లారా తన పుస్తకంలో రాసుకొచ్చాడు. లారా రాసిన రాతలపై ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు గుస్సా అవుతున్నారు. ఇద్దరూ కలిసి ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. పుస్తకంలో రాసిన అంశాల పట్ల రిచర్డ్స్, హూపర్‌లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ గురించి లేనిపోనివి కల్పించి పుస్తకంలో రాసినట్టు పేర్కొన్నారు. ప్లేయర్ల మధ్య ఉన్న రిలేషన్‌ను తప్పుపట్టేలా ఆ పుస్తకం ఉందని చెప్పారు. చేసిన దానికి లారా తమకు క్షమాపణలు చెప్పాలని ఇద్దరు ఆటగాళ్లు డిమాండ్ చేశారు.