Nithyananda Kailasa : ఐరాస సమావేశానికి నిత్యానంద కైలాస దేశ ప్రతినిధి హాజరు.!
అత్యాచారంతో పాటు పలు కేసుల్లో నిందితుడైన ధ్యానపీఠం సంస్థ వ్యవస్థాపకుడు వివాదస్పద గురువు నిత్యానంద భారత్ నుంచి పారిపోయిన విషయం అందరికి తెలిసిన విషయమే .. అయితే అలా పారిపోయిన నిత్యానంద మళ్లీ వార్తల్లోకెక్కారు.. తాను కొనుగోలుచేసిన ఒక ద్వీపానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అని పేరు పెట్టి తనకి తాను ఆ దేశానికీ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు.. అంతే కాకుండా ఒక దేశానికీ కావాల్సిన అన్ని సదుపాయాలను సృష్టించుకున్నారు.. ఆర్థిక, సామాజిక, న్యాయవ్యవస్థ ఇలా అన్నిటిని […]
అత్యాచారంతో పాటు పలు కేసుల్లో నిందితుడైన ధ్యానపీఠం సంస్థ వ్యవస్థాపకుడు వివాదస్పద గురువు నిత్యానంద భారత్ నుంచి పారిపోయిన విషయం అందరికి తెలిసిన విషయమే .. అయితే అలా పారిపోయిన నిత్యానంద మళ్లీ వార్తల్లోకెక్కారు.. తాను కొనుగోలుచేసిన ఒక ద్వీపానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అని పేరు పెట్టి తనకి తాను ఆ దేశానికీ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు.. అంతే కాకుండా ఒక దేశానికీ కావాల్సిన అన్ని సదుపాయాలను సృష్టించుకున్నారు.. ఆర్థిక, సామాజిక, న్యాయవ్యవస్థ ఇలా అన్నిటిని కలిపి ఆయనకు నచ్చినట్టు ఒక రాజ్యాంగాన్నే సృష్టించుకున్నారు.. ఇదంతా ఆలా ఉంటే ఇటీవల జరిగిన ఒక సంఘటన అందరిని షాక్ కి గురిచేసింది.
ఫిబ్రవరి 24న జరిగిన ఐక్యరాజ్యసమితి కీలక సమావేశంలో కైలాస దేశ ప్రతినిధిగా విజయప్రియ నిత్యానంద అనే మహిళ హాజరయ్యారు. ఆమెతో పాటు కొందరు మహిళ ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.. ఈ సమావేశంలో కైలాస దేశం గురించి వివరిస్తూ అక్కడి వనరులను, ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ఐరాస గుర్తింపు లేని ఒక దేశం ఇలాంటి కీలక సమావేశంలో పాల్గొనడం విమర్శలకు దారి తీసింది. అయితే దీనిపై స్పందించిన యూఎస్ కే ప్రతినిధులు.. ఒక దేశం తరపున ఆ చర్చలో వాళ్లు పాల్గొనలేదని, ఒక స్వచ్చంద సంస్థగా మాత్రమే వాళ్లు మాట్లాడారని వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదని ఐరాస స్పష్టం చేసింది. అయితే జెనివా చర్చా గోష్టిలో అనుమతితో ఎవరైనా వచ్చి మాట్లాడొచ్చని దానికి అడ్డుచెప్పలేమని తెలిపింది.
ఇక ఈ సమావేశంలో కైలాస దేశ ప్రతినిధిగా విజయప్రియ నిత్యానంద మాట్లాడుతూ.. భారత దేశంపై తమ అక్కసు వెళ్లగక్కింది.. నిత్యానందను భారత దేశం అవమానించిందని, ఒక దైవాంశ సంభూతుడిపై తప్పుడు కేసులు పుట్టి అవమానించారని ఆమె తెలిపింది.