విజయ్ మాల్యా ఇండియాకు తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

విజయ్ మాల్యా ఇండియాకు తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఆయనను భారత దర్యాప్తు సంస్థలు పట్టుకుని తీసుకురాలేకపోయాయి. ఇప్పుడు ఆయన తాను బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పు కంటే చాలా ఎక్కువగా తన ఆస్తులు అమ్మి తీసుకున్నాయని ఆ లెక్కలు చెప్పడం లేదని.. ఆ స్టేట్ మెంట్లు ఇచ్చేలా ఆదేశించాలని కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ప్రకారం.. ఆయనకు అప్పులు ఇచ్చిన బ్యాంకులు.. స్వాధీనం చేసుకుని వేలం వేసిన ఆస్తుల వివరాలను వెల్లడిస్తే.. విజయ్ మాల్యా అప్పు తీరిపోయిందో లేదో క్లారిటీ వస్తుంది.

ఎంపీగా ఉన్న సమయంలో విజయ్ మాల్యా అప్పులు ఎగ్గొట్టి లండన్ పారిపోయారు. కింగ్ ఫిషర్ బ్రాండ్ తయారు చేసే యూబీ బ్రూవరీస్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సహా ఎన్నో వ్యాపారాలను ఆయన అమ్ముకోవాల్సి వచ్చింది. ఆస్తులు తనఖా పెట్టి తెచ్చి రుణాలు నిరర్థకం అయ్యాయి. ఆయన ఆస్తులను చాలా వరకూ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ అప్పులు ఎంత వరకూ తీరాయన్నది బ్యాంకులు చెప్పడం లేదు.

విజయ్ మాల్యా ఇటీవలి కాలంలో తరచూ బ్యాంకులకు ఉన్న అప్పులు ఆరు వేల కోట్లు.. తన ఆస్తులు ఇరవై వేల కోట్లు రాయించుకున్నారని ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే ఆయన లండన్ లో ఉండి ఈ కామెంట్లు చేస్తూండటంతో విలువ లేకుండా పోతోంది. ఆయన పారిపోకుండా ఇండియాలో ఉండి ఉంటే మహా అయితే ఓ ఆరు నెలలు జైల్లో ఉండి ఉండేవారని .. ఆ తర్వాత మళ్లీ దర్జాగా తన పని తాను చేసుకునేవారని జరుగుతున్న పరిణామాలను విశ్లేషించేవారు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైనా లండన్ ను నుంచి వచ్చి ఆయన తన ఆస్తులను, సెటిల్ చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు. అందులో భాగంగానే ఆయన హైకోర్టులో పిటిషన్ వేసినట్లుగా భావిస్తున్నారు.

ehatv

ehatv

Next Story