వియత్నాంలో(Vietnam) ఓ బ్రిడ్జ్‌(Bridge) ఉంటుంది. బ్రిడ్జ్‌లాగానే కట్టారు కానీ దాన్ని అటు ఇటు దాటడానికి కాదు కట్టింది. మరెందుకు కట్టారంటే ముద్దులు(Kiss) పెట్టుకోవడానికి! నిజంగానే నిజం! చాలా చిత్రంగా ఉంది కదూ! దక్షిణ వియత్నాంలోని ఫ్యూక్వోక్‌ ద్వీపంలో(Phu Quoc Island) ఈ ముద్దుల వంతెన ఉంది. అందమైన బీచ్‌లకు పేరుపొందిన ఆ ద్వీపంలోని సన్‌సెట్‌(Sunset) సిటీలోనే ఆ వంతెనను నిర్మించారు. ఇంచుమించు 800 మీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జ్‌ ఇప్పుడు టూరిస్ట్ స్పాటయ్యింది.

ఈ ముద్దుల బ్రిడ్జ్‌ డిజైన్‌ను ఇటలీకి చెందిన ఆర్కిటెక్ట్‌ మార్కో కాసామోంటీ రూపొందించాడు. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు మైకేలాంజిలో సిస్టిన్‌ చాపెల్‌లో సృజించిన ఫ్రెస్కో(Michelangelo fresco painting) పెయింటింగ్‌ స్ఫూర్తితో దీన్ని డిజైన్‌ చేశారు. టూరిజం డెవలపర్‌ సంస్థ సన్‌గ్రూప్‌ ఈ వంతెనను నిర్మించింది. రెండు సగాలుగా నిర్మించిన ఈ బ్రిడ్జ్‌ ఫ్రెస్కో పెయింటింగ్‌లోని(Michelangelo fresco painting) రెండు చూపుడు వేళ్లలాగే రెండు సగాలు పరస్పరం తాకవు. వాటి మధ్య 30 సెంటీమీటర్ల డిస్టన్స్‌ ఉంటుంది. దూరంనుంచి చూస్తే ఆ రెండు అంచులు ఒకదాన్నొకటి ముద్దుపెట్టుకున్నట్టుగానే కనిపించడం విశేషం. ముద్దులు పెట్టుకోవాలనుకునే జంటలో ఒకరు ఆ సగం నుంచి, మరొకరు ఈ సగం మీద నుంచుని వీలైనంతగా ముందుకు వంగాలన్నమాట! చుంబించుకుంటూ ప్రేమను వ్యక్తపరుచుకోవచ్చు. ముద్దులు పెట్టుకుంటూనే పెళ్లి ప్రపోజల్‌ తీసుకురావచ్చు. అన్నట్టు ఈ బ్రిడ్జ్‌ పేరే చౌహోన్‌. అంటే పెళ్లికి ప్రపోజ్‌ చేసుకోవడం అన్నమాట! ఈ బ్రిడ్జ్‌ ప్రారంభమయ్యి పది రోజులు కూడా కాలేదు కానీ చూసేందుకు టూరిస్టులు కుప్పలు తెప్పలుగా వస్తున్నారు. చెరోవైపున నిలబడి ముద్దులు పెట్టుకోవడానికి జంటలు కూడా భారీగా వస్తున్నాయి.

Updated On 28 Dec 2023 7:11 AM GMT
Ehatv

Ehatv

Next Story