కార్లలో ఒకటి ట్రాక్ నుండి వేరై... ఈవెంట్ ను చూడడానికి వచ్చిన ప్రేక్షకులు, అధికారులపైకి

ఆదివారం శ్రీలంకలో నిర్వహించిన కారు రేసింగ్ పోటీల సందర్భంగా ఒక కారు ట్రాక్‌పై నుంచి దూసుకెళ్లి ప్రేక్షకులు, రేస్ అధికారులపైకి వెళ్ళింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. రాజధాని కొలంబోకు తూర్పున 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంట్రల్ హిల్స్‌లోని దియాతలావా పట్టణంలో జరిగిన రేసులో ఈ ప్రమాదం జరగడంతో వేలాది మంది ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

పోలీసు అధికార ప్రతినిధి నిహాల్ తల్దువా మాట్లాడుతూ, కార్లలో ఒకటి ట్రాక్ నుండి వేరై... ఈవెంట్ ను చూడడానికి వచ్చిన ప్రేక్షకులు, అధికారులపైకి దూసుకెళ్లిందని అన్నారు. ఈ ఘటనలో నలుగురు అధికారులతో సహా ఏడుగురు మరణించారని, మరో 20 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తల్దువా తెలిపారు. క్షతగాత్రులలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని అన్నారు. ఇది 24 ఈవెంట్‌లలో 17వదని తల్దువా చెప్పారు. ప్రమాదం తర్వాత రేసును నిలిపివేశారు. శ్రీలంక మిలిటరీ అకాడమీలో రేస్ సర్క్యూట్‌లో దాదాపు 45,000 మంది ప్రేక్షకులు ఈ ఈవెంట్ ను చూడడానికి గుమిగూడారు. శ్రీలంక ఆర్మీ, శ్రీలంక ఆటోమొబైల్ స్పోర్ట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి

Updated On 21 April 2024 9:17 PM GMT
Yagnik

Yagnik

Next Story