చెట్టుకు ఇనుప గొలుసులతో బంధించి ఉన్న అమెరికా మహిళను( america Women)కాపాడి ఆమెను రత్నగిరి(Ratnagiri)లోని ఓ మానసిక వైద్యశాలలో చేర్పించిన విషయం తెలిసిందే.

చెట్టుకు ఇనుప గొలుసులతో బంధించి ఉన్న అమెరికా మహిళను( america Women)కాపాడి ఆమెను రత్నగిరి(Ratnagiri)లోని ఓ మానసిక వైద్యశాలలో చేర్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పుడో ట్విస్ట్‌! ఆమెను ఎవరూ బంధించలేదట! తనకు తానుగానే బందీ అయ్యిందట! ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పారు. ప్రస్తుతం తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని, తనకు భర్త కూడా లేడని పోలీసులకు చెప్పింది. మహారాష్ట్ర(Maharashtra) సింధుదుర్గ్‌(Sindhudurg)జిల్లాలోని అటవీ ప్రాంతంలో అకలితో అలమటిస్తూ, వర్షంలో తడుస్తూ నిరసంగా ఉన్న ఆ మహిళ ఆర్తనాదాలు విన్న ఓ గొర్రెల కాపరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెను కాపాడి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె దగ్గర ఉన్న సంచిలో లభించిన ఓ లేఖలో తన మాజీ భర్త ఇందుకు కారణమని ఉంది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆమె వాంగూల్మంతో పోలీసులకు మైండ్‌ బ్లాక్ అయ్యింది. ఆమె మూడు తాళాలు, ఇనుప గొలుసును తెచ్చుకుని, అందులో ఒక తాళంతో తనకు తానుగానే చెట్టుకు కట్టేసుకుందని పోలీసులు చెప్పారు. ఆమెను గుర్తించిన ప్రదేశానికి కొన్ని మీటర్లు దూరంలోనే వాటి తాళాలను కనుగొన్నామన్నారు. అయితే, ఆ చెట్టుకు కట్టేసుకొని ఎన్నిరోజులయ్యిందనే విషయంపై మాత్రం స్పష్టత లేదని సింధూదుర్గ్‌ పోలీసులు తెలిపారు. ఆమె తల్లి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని చెప్పారు. అయితే ఇప్పటివరకు ఆమె కుటుంబ సభ్యులెవరూ తమను సంప్రదించలేదన్నారు పోలీసులు.

ehatv

ehatv

Next Story