US Vice President JD Vance : భారత్ చేరుకున్న జేడీ వాన్స్-ఉషా చిలుకూరి (ఆంధ్రప్రదేశ్ ఆడపడుచు)

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) తన భార్య ఉషా చిలుకూరి వాన్స్(Usha Chilukuri Vance), ముగ్గురు పిల్లల ఈవాన్, వివేక్, మిరాబెల్ కలిసి ఈరోజు నుంచి ఈనెల 24 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. ఆయన ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్‌కు తొలిసారి వచ్చారు. ఈ పర్యటనలో పలు కార్యక్రమాలు, అధికారిక భేటీలు, పర్యాటక ప్రదేశాల విజిట్ ఉన్నాయి. ఉన్నాయి. క్రింద ఈ పర్యటన యొక్క వివరాలు ఇవ్వబడ్డాయి.
జేడీ వాన్స్, ఆయన కుటుంబం ఇటలీ (itlay)నుంచి ఢిల్లీలోని పాలం ఎయిర్‌బేస్‌లో ఈరోజు ల్యాండ్ అయ్యారు. భారత సంప్రదాయ నృత్యంతో వారికి ఘన స్వాగతం లభించింది. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వాగతం పలికారు. వాన్స్ కుటుంబం భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు, ముఖ్యంగా పిల్లలు సాంప్రదాయ దుస్తులు ధరించారు. సాయంత్రం జేడీ వాన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన పరస్పర సుంకాలు ప్రాంతీయ భద్రత, మరియు భారత్-అమెరికా ఆర్థిక సంబంధాల బలోపేతం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. ప్రధాని మోదీ వాన్స్ కుటుంబానికి ఢిల్లీలో విందు ఇవ్వనున్నారు.
జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు సంతతికి చెందిన అమెరికన్ కావడం విశేషం. ఢిల్లీలో వాన్స్ పర్యటన సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పాలం ఎయిర్‌పోర్ట్, చాణక్యపురిలోని దౌత్య ప్రాంతంలో స్వాగత హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు.
ఉషా చిలుకూరి వాన్స్, అమెరికాలో పుట్టి పెరిగినప్పటికీ, ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఈ పర్యటన ఆమెకు స్వదేశంతో సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశంగా భావించబడుతోంది.
