విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారులు, వృత్తిదారుల వీసా దరఖాస్తు ఫీజులను అమెరికా అమాంతం పెంచేసింది. మే 30 నుంచి పెంచిన ధరలు అమలులోకి వస్తాయి. నాన్‌ ఇమ్మిగ్రుంట్‌ వీసా అప్లికేషన్‌ (ఎన్‌ఐవీ) ప్రాసెసింగ్‌ ఫీజును కూడా 165 డాలర్ల నుంచి 185 డాలర్లకు పెంచినట్టు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఇక స్టూడెంట్‌, టూరిస్టు, వర్క్‌ వీసా దరఖాస్తు ఫీజులు 15 డాలర్ల నుంచి 110 డాలర్ల వరకు పెరిగాయి. వీటితోపాటు తాత్కాలిక వృత్తిదారులకు ఇచ్చే కొన్ని రకాల నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసా ఫీజును 190 డాలర్ల నుంచి 205 డాలర్లకు

విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారులు, వృత్తిదారుల వీసా దరఖాస్తు ఫీజుల(visa fee)ను అమెరికా (America)అమాంతం పెంచేసింది. మే 30 నుంచి పెంచిన ధరలు అమలులోకి వస్తాయి. నాన్‌ ఇమ్మిగ్రుంట్‌ వీసా అప్లికేషన్‌ (ఎన్‌ఐవీ) ప్రాసెసింగ్‌ ఫీజును కూడా 165 డాలర్ల నుంచి 185 డాలర్లకు పెంచినట్టు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఇక స్టూడెంట్‌, టూరిస్టు, వర్క్‌ వీసా దరఖాస్తు ఫీజులు 15 డాలర్ల నుంచి 110 డాలర్ల వరకు పెరిగాయి. వీటితోపాటు తాత్కాలిక వృత్తిదారులకు ఇచ్చే కొన్ని రకాల నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసా ఫీజును 190 డాలర్ల నుంచి 205 డాలర్లకు, ప్రత్యేక వృత్తి నిపుణులకు ఇచ్చే వీసా ఫీజును 205 డాలర్ల నుంచి 315 డాలర్లకు పెంచుతున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ప్రస్తుత కరెన్సీ మారకం రేట్ల ప్రకారం (ప్రస్తుతం అమెరికా డాలర్‌ రేటు దాదాపు 81 రూపాయలు ఉంది) ఈ కేటగిరి ఫీజులు 13,095 రూపాయల నుంచి 15, 140 రూపాయలకు పెరిగాయి. ఇక తాత్కాలిక ఉద్యోగులకు జారీ చేసే హెచ్‌, ఎల్‌, ఓ, పీ, క్యూ, ఆర్‌ కేటగిరీల వీసా దరఖాస్తు ఫీజులను 190 డాలర్ల నుంచి 205 డాలర్లకు అమెరికా పెంచింది. అంటే 15,550 రూపాయల నుంచి 16,777 రూపాయల వరకు పెరిగాయన్నమాట!

Updated On 10 April 2023 12:31 AM GMT
Ehatv

Ehatv

Next Story