Donald Trump : రహస్య పత్రాల కేసు.. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేసేది కష్టమే!
వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి, విజయం సాధించి శ్వేత భవనంలో కొలువుతీరాలని ముచ్చపడుతున్న డొనాల్డ్ ట్రంప్ మెడకు రహస్య పత్రాల కేసు చుట్టుకుంది. ఫెడరల్ జ్యూరీ ఓ మాజీ అధ్యక్షుడిపై , అది కూడా నేరుగా ఆరోపణలను నమోదు చేయడమన్నది అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ వ్యవహారానికి సంబంధించి జూన్ 13వ తేదీన మియామిలోని ఫెడలర్‌కోర్టు హౌస్‌లో హాజరు కావాలని ట్రంప్‌కు సమన్లు కూడా అందాయి.
వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి, విజయం సాధించి శ్వేత భవనంలో కొలువుతీరాలని ముచ్చపడుతున్న డొనాల్డ్ ట్రంప్ మెడకు రహస్య పత్రాల కేసు చుట్టుకుంది. ఫెడరల్ జ్యూరీ ఓ మాజీ అధ్యక్షుడిపై , అది కూడా నేరుగా ఆరోపణలను నమోదు చేయడమన్నది అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ వ్యవహారానికి సంబంధించి జూన్ 13వ తేదీన మియామిలోని ఫెడలర్‌కోర్టు హౌస్‌లో హాజరు కావాలని ట్రంప్‌కు సమన్లు కూడా అందాయి. ట్రంప్‌పై క్రిమినల్ కేసు నమోదు కావడం ఇదే రెండోసారి కావడంతో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం కష్టమే! రహస్య పత్రాల కేసుకు సంబంధించి ట్రంప్‌పై మత్తం ఏడు ఆరోపణలు నమోదయ్యాయి. అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఆయన వందలాది కీలక పత్రాలను ఫ్లోరిడాలోని తన మార్ ఏ లాగో ఎస్టేట్‌కు తరలించినట్టు ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ కేసు నమోదు చేసింది. ఆ పత్రాలను తిరిగి తీసుకునేందుకు నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్ అడ్మినిస్ట్రేషన్ చేసిన ప్రయత్నాలను ట్రంప్ అడ్డుకున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధాలని ట్రంప్ అంటున్నారు. పనిలో పనిగా అధ్యక్షుడు జో బైడెన్‌పై కూడా మండిపడ్డారు. బైడెన్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంగా మారిందని ఆరోపించారు.
లాస్టియర్ జనవరిలో ఎఫ్‌బీఐ అధికారులు ట్రంప్ ఎస్టేట్‌లో సోదాలు చేపట్టారు. 15 బాక్సులలో 184 కీలక పత్రాలు లభించాయి. ఇందులో 67 విశ్వసనీయ, 92 రహస్య, 25 అత్యంత రహస్య పత్రాలు ఉన్నాయి. ఒక్కో బాక్సుల్లో రహస్య పత్రాలతో పాటు వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, ఫొటోలు, వివిధ రకాల ప్రింట్‌అవుట్‌లు, వ్యక్తిగత పత్రాలు కలిపి ఉన్నాయట. ట్రంప్‌పై ఏడు అభియోగాలు మోపారు. మొదటిది ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత రహస్య పత్రాలను ఉద్దేశపూర్వకంగా తన దగ్గరే పెట్టుకోవడం, రెండోది న్యాయ ప్రక్రియను అడ్డుకోవడానికి కుట్ర పన్నడం. మూడోది ఓ డ్యాకుమెంట్ లేదా రికార్డును తన దగ్గర ఉంచుకోవడం. నాలుగోది ఓ డ్యాకుమెంట్ లేదా రికార్డును నిజాయితీ లేకుండా దాచిపెట్టడం, అయిదోది ఫెడరల్ దర్యాప్తులో ఓ డ్యాకుమెంట్‌ను దాచిపెట్టడం. ఆరోది గుట్టు బయటపడకుండా ప్లాన్ చేయడం, ఏడోది తప్పుడు స్టేట్‌మెంట్లు, రిప్రజెంటేషన్లు ఇవ్వడం. ఇవి రుజువైతే మాత్రం ట్రంప్ జైలుకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఓ వందేళ్ల జైలు శిక్ష పడవచ్చు. అలాగే క్రిమినల్ కేసులు మోపపడ్డాయి కాబట్టి అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఆల్‌రెడీ ట్రంప్‌పై శృంగార తారకు డబ్బుల చెల్లింపు కేసు ఉంది. ఇప్పటిలాగే ఈ అభియోగాలను కొట్టిపారేశారు ట్రంప్. తాను అమాయకుడినని, కుట్రపూరితంగానే తనపై ఈ అభియోగాలు మోపారని ఆరోపించారు ట్రంప్. ఎన్నికలలో తనను అడ్డుకోవడానికి డెమోక్రాట్లు కుట్ర చేస్తున్నారని ట్రంప్ తెలిపారు.