ఉక్రెయిన్‌ , రష్యా లకు మధ్య యుద్ధం జరుగుతోన్న సందర్భంలో ... అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఉక్రెయిన్‌కు తొలిసారి ఆకస్మికంగా పర్యటించి ప్రపంచ దేశాలను నివ్వెరపరిచిన విషయం తెలిసిందే . ఉక్రెయిన్‌కు సంఘీభావం ప్రకటించడానికి బైడెన్ పెను సాహసమే చేశారు అని చెప్పవచ్చు .అధ్యక్ష భవనం నుంచి ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు పోలండ్‌ మీదుగా ఉక్రెయిన్‌కు రహస్యంగా వెళ్లి తిరిగి రావడం గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. తన ఎయిర్‌ఫోర్స్ వన్ […]

ఉక్రెయిన్‌ , రష్యా లకు మధ్య యుద్ధం జరుగుతోన్న సందర్భంలో ... అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఉక్రెయిన్‌కు తొలిసారి ఆకస్మికంగా పర్యటించి ప్రపంచ దేశాలను నివ్వెరపరిచిన విషయం తెలిసిందే . ఉక్రెయిన్‌కు సంఘీభావం ప్రకటించడానికి బైడెన్ పెను సాహసమే చేశారు అని చెప్పవచ్చు .అధ్యక్ష భవనం నుంచి ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు పోలండ్‌ మీదుగా ఉక్రెయిన్‌కు రహస్యంగా వెళ్లి తిరిగి రావడం గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. తన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానాన్ని పక్కనబెట్టి ఓ చిన్న విమానంలో పోలెండ్‌కు చేరుకున్న బైడెన్.. రాత్రిపూట అక్కడ నుంచి రైలు మార్గం ద్వారా 10 గంటలు ప్రయాణించి ...ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరానికి చేరుకున్నారు. ఐదు గంటల పాటు ఉక్రెయిన్‌లో గడిపిన జోబైడెన్.. ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీతో పలు అంశాలపై చర్చించారు..అయితే ఆయన వాషింగ్టన్‌లోనే ఉన్నారని వైట్‌హౌస్ షెడ్యూల్‌లోనూ కనిపించడం గమనార్హం. ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చే క్రమంలో ... ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తోన్న రష్యా ఎన్నటికీ ఆ దేశంపై విజయం సాధించలేదని జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ ఆకస్మిక పర్యటన ముగించుకుని.. తిరుగు ప్రయాణంలో బైడెన్ కాసేపు పోలెండ్‌లో అగారు. ఈ సందర్భంగా ఆయన , ఉక్రెయిన్ శరణార్థులను ఉద్దేశించి ప్రసంగి0చారు . . ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధంతో ప్రపంచ ప్రజాస్వామ్యాల పరిరక్షణలో తమ సంకల్పం మరింత బలోపేతమయిందని అన్నారు . మున్ముందు మరింత కఠినమైన, గడ్డురోజులు ఉన్నాయని జో బైడెన్ హెచ్చరించారు.

అయితే ఉక్రెయిన్‌కు తమ మద్దతు కొనసాగుతుందన్న బైడెన్... మిత్రపక్షాలతో కలిసి ఆ దేశానికి అండగా నిలుస్తామన్నారు . రష్యా ఎన్నటికీ విజయం సాధించలేదని, ఉక్రెయిన్‌ బలంగా నిలుస్తోందని అన్నారు. ‘‘సామ్రాజ్యాన్ని పునర్నిర్మించాలనే తపనతో ఉన్న నియంత ప్రజల స్వేచ్ఛ, ప్రేమను ఎప్పటికీ హరించలేడు.. అని పరోక్షంగా పుతిన్‌‌కు చురకలంటించారు. ఈ సందర్భంగా తన పర్యటనను ఉద్దేశించి పుతిన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పుతిన్ అన్నట్టు పశ్చిమ దేశాలు రష్యాను కూలదోయడానికి దాడి చేయడం లేదన్నారు. రష్యాలోని కోట్లాది మంది పౌరులు తమ పొరుగునున్న వారు శత్రువుల కాదని, ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నారన్నారు . .. భయంతో పరిపాలించే ప్రపంచాన్ని అంగీకరించడానికి నిరాకరించిన ప్రతిచోటా అమెరికా, ఇతర దేశాల ఉక్కు సంకల్పం ముందు ఓడిపోతాడు’ అని ఘాటుగా స్పందించారు.

అంతకు ముందే పోలెండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్‌ దుదా తో భేటీ అయినా బైడెన్.. . ఐరోపాలో భద్రత గురించి చర్చించారు . నాటో కూటమి మునుపెన్నడూ లేనంత బలంగా ఉందన్నారు. అమెరికాకు పోలెండ్‌, నాటో ఎంత అవసరమో, నాటోకు అమెరికా అంత అవసరమని చెప్పారు మరోవైపు . బైడెన్‌ ఆకస్మికంగా పర్యటనపై పోలెండ్ అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. ఉక్రెయిన్‌కు ఈ పర్యటన ఎంతో స్థైర్యాన్ని నింపుతుందని చెప్పారు. మరోవైపు, ఉక్రెయిన్‌ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదని, క్షేత్రస్థాయి పరిస్థితులు సంక్లిష్టంగా మారుతున్నాయని అమెరికా అధ్యక్షభవనం వైట్‌హౌస్ ఆందోళన వ్యక్తం చేసింది.

Updated On 6 April 2023 2:08 AM GMT
Ehatv

Ehatv

Next Story