ప్రాణాంతకమైన ఇన్సులిన్‌ను అధిక మొత్తంలో రోగులకు ఇచ్చి వారి మృతికి కారణమైందన్న ఆరోపణలు రుజువు కావడంతో అమెరికాలోని (America) పెన్సిల్వేనియా (Pennsylvania)లో ఓ నర్సుకు కోర్టు ఏకంగా 760 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

ప్రాణాంతకమైన ఇన్సులిన్‌ను అధిక మొత్తంలో రోగులకు ఇచ్చి వారి మృతికి కారణమైందన్న ఆరోపణలు రుజువు కావడంతో అమెరికాలోని (America) పెన్సిల్వేనియా (Pennsylvania)లో ఓ నర్సుకు కోర్టు ఏకంగా 760 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇన్సులిన్‌ను అధిక మొత్తంలో ఇవ్వడంతో 17 మంది రోగులను చంపినట్లు హీథర్‌ ప్రెస్డీ (Hether Pressdee) అనే నర్సుపై ఆరోపణలు వచ్చాయి. అయితే మూడు హత్య కేసుల్లో హీథర్‌ ప్రెస్డీ ప్రమేయం రుజువు కావడంతో కోర్టు మూడు జీవిత కాలాలు అంటే 760 సంవత్సరాల జైలుశిక్షను విధించింది. 2020-23 మధ్య కాలంలో నాలుగు కౌంటీలలో ఐదు సంరక్షణ కేంద్రాల్లో ఉంటున్న 17 మంది పేషెంట్ల ప్రాణాలు పోవడంలో ఈమె పాత్ర ఉందని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. ఈమె తరుచుగా రోగుల పట్ల అవమానకరరీతిలో వ్యవహరించేదని.. రోగులను దూషించేదని తెలిపారు. తోటి నర్సులు, సిబ్బంది కూడా ఈమె ప్రవర్తన పట్ల విసుగుచెందారని పేర్కొన్నారు.

రోగులకు పెద్ద మొత్తంలో ఇన్సులిన్ ఇచ్చిందని హారిసన్ ప్రెస్డీపై ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. సిబ్బంది తక్కువగా ఉన్నప్పుడు.. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉన్నప్పుడు ఆమె ఈ విధంగా ప్రవర్తించేదని.. రాత్రి సమయంలో ఈ ఇన్సులిన్‌ను పేషెంట్లకు ఎక్కించేందని నర్సు హీథర్‌ ప్రెస్డీపై అభియోగాఉ నమోదు చేశారు. ఆమె నర్సింగ్ లైసెన్స్‌ను కూడా ఈ ఏడాది ప్రారంభంలో సస్పెన్స్ చేశారు. రోగులు, సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించేదని.. వారికి అధిమోతాదులో ఇన్సులిన్‌ ఇచ్చి మృతి కారకురాలైనట్లు ప్రాసిక్యూటర్లు ఆధారాలతో సహా నిరూపించడంతో కోర్టు ఇంతటి భారీ శిక్ష విధించింది.

Updated On 3 May 2024 1:10 AM GMT
Ehatv

Ehatv

Next Story