అమెరికా వీసా రెన్యూవల్ చేయాలి అనుకునేవారు డ్రాప్ బాక్స్ ద్వారా అప్లికేషన్స్ ఇవ్వవచ్చని భారత్ లోని USA Embassy తెలిపింది. ఇక మీద మెయిల్స్ ద్వారా వీసా రెన్యూవల్ చేయటాన్ని అనుమతిచటం జరగదు. గత ఏడాది 1,25,000 యూ ఎస్ వీసాలను ఆమోదించినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది రికార్డు స్థాయి లో వీసాలు మంజూరు చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. డ్రాప్ బాక్స్ విధానం లో ఇంటర్వ్యూ లేకుండా అభ్యర్థి వీసా రెన్యూవల్ కి దరఖాస్తు చేసుకునే […]

అమెరికా వీసా రెన్యూవల్ చేయాలి అనుకునేవారు డ్రాప్ బాక్స్ ద్వారా అప్లికేషన్స్ ఇవ్వవచ్చని భారత్ లోని USA Embassy తెలిపింది. ఇక మీద మెయిల్స్ ద్వారా వీసా రెన్యూవల్ చేయటాన్ని అనుమతిచటం జరగదు. గత ఏడాది 1,25,000 యూ ఎస్ వీసాలను ఆమోదించినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది రికార్డు స్థాయి లో వీసాలు మంజూరు చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

డ్రాప్ బాక్స్ విధానం లో ఇంటర్వ్యూ లేకుండా అభ్యర్థి వీసా రెన్యూవల్ కి దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది. వీసా మంజూరు,రెన్యూవల్ కి ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఈ విధానాన్ని అమలు లోకి తీసుకు రావటం జరిగింది. నాలుగేళ్లుగా అమెరికా వీసా ఉన్నవాళ్లు దేనికి అర్హులు. మొదటిసారి వీసా దరఖాస్తు చేసుకున్నవారికి నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకూ భారత్ లోని కాన్సులేట్ కార్యకలాపాల్ని వేగావంతం చేస్తూ దేశ వ్యాప్తంగా సిబ్బందిని పెంచడం జరిగింది. ఢిల్లీ లోని యూ ఎస్ ఎంబసీ తో పాటు ముంబయి ,చెన్నై,హైదరాబాద్ .కొలకత్తా కాన్సులేట్ కేంద్రాల్లో ప్రతి శనివారం వీసాకు దరఖాస్తు చేసుకున్నవారికి ప్రత్యేక ఇంటర్వ్యూలు జరపాలని తెలిపింది.
ఈ కార్యక్రమాన్ని జనవరి 21 నుండి లాంచనం గా ప్రారంభించారు. వీసా కోసం దరకాస్తు చేసుకున్న వారి అవసరాల దృష్ట్యా అమెరికా నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఇంటర్వూస్ ని నిర్వహిస్తున్నట్లు యూ ఎస్ ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది. వీసా జారీ చేసే ప్రక్రియ వేగవంతం చేయడానికి ఈ విధానంమరింత దోహద పడుతుంది.

Updated On 6 April 2023 2:08 AM GMT
Ehatv

Ehatv

Next Story