Goldy Brar : గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు...
ఇండియా(India)కు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్(Gangster Goldy Brar)పై వస్తున్న వార్తలు నిజం కావని, అతడు బతికే ఉన్నాడని అమెరికా పోలీసులు(America Police) స్పష్టం చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా(California)లో గోల్డీబ్రార్ హత్యకు గురయ్యాడన్న ప్రచారం అవాస్తవమని చెప్పారు. అమెరికా పోలీసుల వివరణకు పూర్వాపరాలు ఏమిటంటే..
ఇండియా(India)కు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్(Gangster Goldy Brar)పై వస్తున్న వార్తలు నిజం కావని, అతడు బతికే ఉన్నాడని అమెరికా పోలీసులు(America Police) స్పష్టం చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా(California)లో గోల్డీబ్రార్ హత్యకు గురయ్యాడన్న ప్రచారం అవాస్తవమని చెప్పారు. అమెరికా పోలీసుల వివరణకు పూర్వాపరాలు ఏమిటంటే.. అమెరికాలోని హోల్ట్ అవెన్యూలో మంగళవారం సాయంత్రం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. చనిపోయిన వ్యక్తి కెనడా కేంద్రంగా పని చేసే గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్ అని అనుకున్నారు. స్థానిక మీడియాలో అలాగే వచ్చింది. అయితే ఫ్రెస్నో పోలీసుల దర్యాప్తులో చనిపోయిన వ్యక్తి గోల్డీబ్రార్ కాదని తేలింది. చనిపోయిన వ్యక్తి 37 ఏళ్ల జేవియర్ గాల్డ్నెగా పోలీసులు గుర్తించారు. 'మీరు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం నిజమనుకుంటే అది పొరపాటే. చనిపోయింది గోల్డీబ్రార్ అనుకుంటే కచ్చితంగా తప్పే. మా డిపార్ట్‌మెంట్‌కు చాలా చోట్ల నుంచి ఎంక్వైరీలు వస్తున్నాయి. అసలు ఈ పుకార్లు ఎలా మొదలయ్యాయో తెలియదు' అని లెఫ్ట్‌నెంట్ విలియం జే డూలే అన్నాడు.
గోల్డీబ్రార్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అతడి పేరు సతీందర్ సింగ్. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో అత్యంత కీలకమైన సభ్యుడు. 2022లో జరిగిన సిద్ధూ మూసేవాల హత్య కేసులో గోల్డీబ్రార్ పేరు మారుమోగింది. బాలీవుడ్ నటుడు సల్మాన్‌కాన్ ఇంటిపై కాల్పులు జరిపిన ఘటనలో కూడా గోల్డీబ్రార్ పేరు వినిపించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల్లో ఒకరు బుధవారం రోజు పోలీసుకస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితులకు ఆయుధాలు సరఫరా చేసినట్లు భావిస్తున్న అనూజ్ తపన్ అనే వ్యక్తిని గత నెల 26వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం అతడు లాకప్ గదిలో ఉన్న మరుగుదొడ్డిలో దుప్పటితో ఉరి వేసుకున్నాడు. టాయ్‌లెట్ నుంచి ఎంతసేపటికీ అనూజ్ బయటకు రాకపోయేసరికి పోలీసులకు అనుమానం వచ్చింది. తలుపులు బద్దలు కొట్టి చూస్తే అనూజ్ అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిన్న చనిపోయాడు.