పాములు(snake) పగపడతాయని అంటుంటారు. అదో నమ్మకం. పగ పట్టే పాములపై అనేక సినిమాలు కూడా వచ్చాయి.

పాములు(snake) పగపడతాయని అంటుంటారు. అదో నమ్మకం. పగ పట్టే పాములపై అనేక సినిమాలు కూడా వచ్చాయి. అలాగే ఏళ్లు గడిచిపోయినా ఏనుగులు మనుషుల మొహలను గుర్తుపడతాయట! కుక్కలు, పిల్లులు, పులులు, సింహాలకు కూడా జ్ఞాపక శక్తి ఉంటుంది. ఇది పక్కనపెడితే కాకులు(crow) కూడా పగబడతాయని తేలింది. తమకు అపకారాన్ని చేసిన వ్యక్తుల ముఖాలను ఏకంగా 17 ఏళ్లపాటు గుర్తుంచుకుంటాయి. నమ్మడం లేదా? నమ్మకం కలగడం లేదా? పరిశోధనలో తేలింది కాబట్టి నమ్మక తప్పదు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే 'మన కుటుంబానికి అన్యాయం చేసిన వారిని వదిలిపెట్టవద్దు ' అని పెద్ద కాకులు తమ పిల్లలకు చెప్పి, వాటి నుంచి మాట తీసుకుని మరీ తుది శ్వాస విడుస్తాయట! అమెరికాకు చెందిన ఓ పరిశోధక బృందం చేసిన తాజా అధ్యయనంలో ఆశ్చర్యకరమైన ఈ విషయాలు తెలిసాయి.

అమెరికాలోని(america) యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌కు(university of washington) చెందిన పర్యావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ జాన్‌ మార్జ్‌లఫ్‌ నేతృత్వంలోని పరిశోధక బృందం సభ్యులు 2006లో ముఖానికి గోస్ట్‌ మాస్క్‌లను ధరించి ఓ ఏడు కాకులను వలలో బంధించారు. అనంతరం వాటికి ఎలాంటి హాని చేయకుండా విడిచిపెట్టారు. ఆ కాకుల ప్రవర్తనను విశ్లేషించడానికి విడిచిపెట్టడానికంటే ముందే ఆ కాకుల కాళ్లకు కొన్ని రింగ్స్‌ను కట్టారు. కొన్నిరోజుల తర్వాత యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆ మాస్కులను ధరించి తాము వెళ్లినప్పుడు కొన్ని కాకులు తమ వైపునకు చూస్తూ గట్టిగా అదేపనిగా అరవడాన్ని గమనించారు. తొలుత కొన్ని కాకులే ఇలా చేయగా, కాలం గడుస్తున్న కొద్ది వీటి సంఖ్య 47 వరకు చేరినట్టు తెలిపారు. చివరిసారిగా 2023 సెప్టెంబర్‌లో అంటే ప్రయోగం ప్రారంభించిన 17 ఏళ్ల తర్వాత మాస్కు పెట్టుకొని తమ బృంద సభ్యులపై ఏ కాకి కూడా అరవకపోవడాన్ని తాము గుర్తించినట్టు వెల్లడించారు.

పరిశోధనలో భాగంగా ఏడు కాకులనే బంధించినప్పటికీ, ఒకానొక సమయంలో ఏకంగా 47 కాకులు తమ వైపు కోపంగా, కసిగా చూశాయని మార్జ్‌లఫ్‌ చెప్పారు. దీన్ని బట్టి తాము బంధించిన తల్లి కాకులు తమ పిల్లలకు, బంధువులకు, సన్నిహితులకు ఆ ఘటన గురించి చెప్పి ఉండొచ్చని, ఈ కారణంతోనే మాస్కు ధరించిన తమపై కొత్త కాకులు కూడా కక్ష పెంచుకొని ఉండొచ్చని మార్జ్‌లఫ్‌ అంటున్నారు. హిందువులు కర్మకాండల్లో భాగంగా పెట్టే పిండాన్ని కాకులు తినడం ఒక సంప్రదాయం. కాకులకు దివ్యదృష్టి ఉన్నదని, అవి ఆత్మలను చూడగలవని నమ్మకం కూడా ఉంది.

Eha Tv

Eha Tv

Next Story