భారతదేశం 2023-24 ఆర్థిక సంవత్సరంలో తన రక్షణ ఎగుమతులను రూ.21,083 కోట్లకు గణనీయంగా పెంచుకుంది.

భారతదేశం 2023-24 ఆర్థిక సంవత్సరంలో తన రక్షణ ఎగుమతులను రూ.21,083 కోట్లకు గణనీయంగా పెంచుకుంది. 2028-29 నాటికి ఈ సంఖ్యను రూ.50 వేల కోట్లకు పెంచడం ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యంగా, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, భారతదేశ రక్షణ ఎగుమతులు రూ.686 కోట్లు. ఇది ఈ పదేళ్లలో గణనీయమైన పురోగతిన కనబర్చింది. ప్రస్తుతం భారత్ 84 దేశాలకు సైనిక పరికరాలను(Solider weapons) ఎగుమతి చేస్తోంది. భారతదేశం నుంచి సైనిక పరికరాలను కొనుగోలు చేసే ఇతర ప్రధాన దేశాల్లో యుఎఇ(UAE), నెదర్లాండ్స్(Netherlands), ఫిలిప్పీన్స్(Philippins), శ్రీలంక(Sri lanka), సౌదీ అరేబియా ఉన్నాయి. భారతదేశం నుంచి ఆయుధాలను కొనుగోలు చేయడంలో అగ్రగామిగా ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.

అమెరికా

మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్(Ministry of defence) గణాంకాల ప్రకారం, భారతదేశం(India) నుంచి సైనిక పరికరాలను కొనుగోలు చేయడంలో యునైటెడ్ స్టేట్స్ ముందంజలో ఉంది. బోయింగ్ ఇండియా, కమిన్స్ టెక్నాలజీస్, అవంటెక్ వంటి భారతీయ కంపెనీలు తయారు చేసిన ఉత్పత్తులు అమెరికాకు సరఫరా చేయబడుతున్నాయి, ఇందులో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి.

ఇజ్రాయెల్(Israel)

ఇజ్రాయెల్ భారతదేశం నుంఇ సైనిక పరికరాలను ప్రధాన కొనుగోలుదారుగా ఉంది. ఇజ్రాయెల్ రెండో స్థానంలో ఉంది. PLR సిస్టమ్స్, కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, అదానీ-ఎల్బిట్, DCX కేబుల్ టెక్నాలజీస్ వంటి భారతీయ కంపెనీల ఉత్పత్తులు ఇజ్రాయెల్‌కు రవాణా చేయబడతాయి. ఇందులో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లు, బ్యాటరీలు ఉన్నాయి.

యునైటెడ్ కింగ్‌డమ్(United Kingdom)

అమెరికా, ఇజ్రాయెల్ మాదిరిగానే, భారతదేశం యునైటెడ్ కింగ్‌డమ్‌కు సైనిక పరికరాలను సరఫరా చేస్తుంది. భారతదేశంలో తయారైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్‌లు, ఏరో కాంపోనెంట్‌లు వంటి ఉత్పత్తులు యూకేకు డెలివరీ అవుతున్నాయి. కమిన్స్ టెక్నాలజీస్, ఎల్ అండ్ టి, మహీంద్రా డిఫెన్స్ , టాటా అడ్వాన్స్‌డ్ వంటి భారతీయ కంపెనీలు ఈ వస్తువులను ఉత్పత్తి చేస్తాయి.

ఫ్రాన్స్(France)

ఫ్రాన్స్ -భారత్‌ మధ్య రక్షణ వాణిజ్యం పెరిగింది. భారతదేశం రాఫెల్ విమానాల కోసం ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. బ్యాటరీలతో సహా అంతరిక్ష భాగాలను సరఫరా చేస్తుంది. ఫ్రాన్స్‌లో సైనిక పరికరాల ప్రధాన సరఫరాదారులలో మహీంద్రా ఏరోస్ట్రక్చర్స్, గోద్రెజ్ & బోయ్స్, డస్సాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్ ఉన్నాయి.

జర్మనీ(germany)

భారతదేశం నుంచి సైనిక పరికరాలను కొనుగోలు చేసే ఐదో అతిపెద్ద దేశంగా జర్మనీ ఉంది. ఇది భారతదేశంలో తయారు చేయబడిన హెల్మెట్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వంటి వస్తువులను కొనుగోలు చేస్తుంది. ఎంకేయూ, ఇండో MIM, మైక్రోన్ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో సహా అనేక భారతీయ కంపెనీలు ఈ సరఫరాలను అందిస్తాయి.

Eha Tv

Eha Tv

Next Story