UK University VC Suspended:హైదరాబాద్ యువతితో వివాహేతర సంబంధం..బ్రిటన్ వర్సిటీ వీసీ సస్పెన్షన్
హైదరాబాద్‌కు చెందిన యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు బ్రిటన్‌లోని బకింగ్‌హామ్ యూనివర్సిటీ(BuckinghamUniversity) వైస్ చాన్సలర్ జేమ్స్ టూలీ (JamesTooley)పై సస్పెన్షన్ వేటు పడింది.

హైదరాబాద్‌కు చెందిన యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు బ్రిటన్‌లోని బకింగ్‌హామ్ యూనివర్సిటీ(BuckinghamUniversity) వైస్ చాన్సలర్ జేమ్స్ టూలీ (JamesTooley)పై సస్పెన్షన్ వేటు పడింది. ఆ యువతి యూనివర్సిటీ ఫీజులను కూడా టూలీ చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 65 సంవత్సరాల టూలీతో తనకు లైంగిక సంబంధం ఉన్నట్లు ఆ యువతి తన డైరీలో రాసుకుంది. టూలీ భార్య ఆ డైరీల కాపీలను యూనివర్సిటీకి అందచేశారు. టూలీ సస్పెన్షన్‌ను అక్టోబర్‌లో యూనివర్సిటీ ప్రకటించింది. అది ఇప్పుడు వెలుగు చూసింది. మొదటిసారి టూలీని కలసినపుడు తనకు 18 ఏళ్లని, తనకు 21 ఏళ్ల వయసున్నపుడు ఆయనతో లైంగిక సంబంధం ఏర్పడిందని ఆ యువతి తన డైరీలో రాసుకుంది. ఇది జరిగినప్పుడు టూలీ 50 ఏళ్ల వయసులో ఉన్నారని డైలీ మెయిల్ పత్రిక తెలిపింది. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని టూలి అన్నారు. 2022లో ఇద్దరు పిల్లల తల్లి అయిన నైజీరియాకు చెందిన సింథియా అనే మహిళతో టూలీకి వివాహమైంది.
