UAE President Sheikh Mohammed : రూ.25 లక్షల కోట్ల ఆస్తి.. ఈ రాజు సొంతం..!
యూఏఈ(UAE) అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జయీద్ అల్ నహ్యాన్(Sheikh Mohammed bin Zayed Al Nahyan) రాజ కుటుంబం ఆస్తుల్లో(Assests) రికార్డు సృష్టించింది. నహ్యాన్ కుటుంబానికి రూ.25 లక్షల కోట్ల ఆస్తులున్నాయి. 2023లో ప్రపంచంలోని సంపన్న కుటుంబాల జాబితాలో ఉన్న వాల్‌మార్ట్(Walmart) యజమాని వాల్టన్‌కు చెందిన కుటుంబాన్ని నహ్యాన్ కుటుంబం దాటిపోయింది.
యూఏఈ(UAE) అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జయీద్ అల్ నహ్యాన్(Sheikh Mohammed bin Zayed Al Nahyan) రాజ కుటుంబం ఆస్తుల్లో(Assests) రికార్డు సృష్టించింది. నహ్యాన్ కుటుంబానికి రూ.25 లక్షల కోట్ల ఆస్తులున్నాయి. 2023లో ప్రపంచంలోని సంపన్న కుటుంబాల జాబితాలో ఉన్న వాల్‌మార్ట్(Walmart) యజమాని వాల్టన్‌కు చెందిన కుటుంబాన్ని నహ్యాన్ కుటుంబం దాటిపోయింది. బ్రిటిష్ రాజకుటుంబంతో సమానంగా యూఏపీ రాజు కుటుంబానికి ఆస్తులున్నట్లు చెప్తారు. యూఏపీ రాజ కుటుంబం పెద్ద అయిన షేక్ మహ్మద్‌బిన్ జయీద్ అల్ నహ్యాన్‌తో పాటు 18 మంది సోదరులు, 11 మంది అక్కా చెల్లెళ్లు ఉన్నారు. నహ్యాన్‌కు 9 మంది పిల్లలు, 18 మంది మనవరాళ్లు, మనవళ్లు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చమురు నిల్వల్లో ఈ కుటుంబానికే 6 శాతం ఉన్నాయి. ప్రముఖ ఎక్స్ (Twitter)లో కూడా వీరికి వాటాలున్నాయి. ఈ రాజకుటుంబానికి ఉన్న రాజభవనం విలువే రూ.4 వేలకోట్లకు పైమాటే. అబుదాబి ఖసర్ అల్ వతన్ రాజ భవనంలో ఈ కుటుంబం నివాసం ఉంటుంది. యూఏఈల్లో చాలా భవనాల్లో ఇదే పెద్దది. 94 ఎకరాల్లో ఈ ప్యాలెస్‌ను నిర్మించారు. వేల కోట్ల విలువైన నౌకలు, ప్రైవేట్ విమానాలు, పారిస్ సహా పలు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో వీరికి ఆస్తులున్నాయి. బుగాటి, లంబోర్గిని, బెంజ్ బ్రాండ్లతో పాటు ఈ రాజు దగ్గర 700 కార్లు ఉన్నాయి.