Two tornadoes in eastern China : చైనాలో టోర్నడో బీభత్సం.. పదుల సంఖ్యలో మృతి
చైనాలో(China) టోర్నడో(tornadoes) బీభత్సం సృష్టించింది. భయంకరమైన ఆ సుడిగాలి ధాటికి పది మందికిపైగా మరణించారు(Died). ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. టోర్నడో ధాటికి పెద్ద పెద్ద వాహనాలు(Vehicle) కూడా గాల్లో ఎగిరిపడ్డాయి. చైనాలోని జియాంగ్స్ ప్రావిన్స్‌లోని(Jiangsu Province) సుకియాన్(Suqian) పట్టణంలో బుధవారం మధ్యాహ్నం టోర్నడో ఒక్కసారిగా విరుచుకుపడింది.
చైనాలో(China) టోర్నడో(tornadoes) బీభత్సం సృష్టించింది. భయంకరమైన ఆ సుడిగాలి ధాటికి పది మందికిపైగా మరణించారు(Died). ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. టోర్నడో ధాటికి పెద్ద పెద్ద వాహనాలు(Vehicle) కూడా గాల్లో ఎగిరిపడ్డాయి. చైనాలోని జియాంగ్స్ ప్రావిన్స్‌లోని(Jiangsu Province) సుకియాన్(Suqian) పట్టణంలో బుధవారం మధ్యాహ్నం టోర్నడో ఒక్కసారిగా విరుచుకుపడింది. వాతావరణ మార్పుల్లో భాగంగా మెల్లగా ప్రారంభమైన సుడిగాలి నిమిషాల్లోనే వేగాన్ని అందుకుంది. ఒక్కసారిగా పట్టణాన్ని చుట్టేసింది. ఏం జరుగుతుందో ప్రజలకు అర్థకాలేదు. అర్థం చేసుకునేంతలోనే భారీ శబ్దంతో పాటు అధిక వేగంతో గాలి వీచింది. ఇళ్ల పై కప్పులు గాలిలో ఎగిరి పడ్డాయి. తర్వాత కొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. ఆ ప్రకృతి వైపరీత్యానికి ప్రజలు భయభ్రాంతులయ్యారు. ఆందోళన చెందారు. భీకరమైన ఆ సుడిగాలి ధాటికి 137 ఇళ్లు నేటమట్టం అయ్యాయి. వేలాది మందిని నిరాశ్రయులయ్యారు. సుడిగాలి భయానికి 400 మంది ఇళ్లను వదిలేసి వెళ్లిపోయారు. టోర్నడో మందగించిన తర్వాత అక్కడి దృశ్యాలు భయానకంగా మారాయి. వాహనాలు ఎక్కడికక్కడే చెల్లాచెదురుగా పడ్డాయి. బరువైన వస్తువులు మీద పడటంతో పలువరు రోడ్డుమీదే చనిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.