చైనాలో(China) చిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. గ్వాంగ్జూ(Guangzhou) నగరంలో ఉన్న పెరల్‌ నదిపై(Pearl River) ఉన్న బ్రిడ్జ్‌ను(Bridge) భారీ కార్గో షిప్‌(Cargo ship) ఢీ కొట్టింది. ఫలితంగా ఇద్దరు మరణించారు. మరో ముగ్గురి జాడ తెలియకుండా ఉంది.

చైనాలో(China) చిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. గ్వాంగ్జూ(Guangzhou) నగరంలో ఉన్న పెరల్‌ నదిపై(Pearl River) ఉన్న బ్రిడ్జ్‌ను(Bridge) భారీ కార్గో షిప్‌(Cargo ship) ఢీ కొట్టింది. ఫలితంగా ఇద్దరు మరణించారు. మరో ముగ్గురి జాడ తెలియకుండా ఉంది. ఫోష్‌మన్‌ నుంచి గ్వాంగ్జూకు వస్తున్న షిప్‌ గురువారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో మార్గ మధ్యలో ఉన్న లిజింగ్షా వంతెనను బలంగా ఢీకొట్టింది. దెబ్బకు వంతెన రెండు ముక్కలయ్యింది. బ్రిడ్జ్‌ మధ్యన నౌక చిక్కుకుపోయింది. ఈ ఘటనలో ఒక బస్సుతో పాటు అయిదు వాహనాలు నదిలో పడిపోయాయి. నదిలో పడిపోయిన బస్సులో కేవలం డ్రైవర్‌ మాత్రమే ఉండటంతో భారీ ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ
షిప్‌లో ఎలాంటి సరుకు లేదని స్థానిక మీడియా పేర్కొంది. ప్రమాదానికి కారణమైన షిప్‌ కెప్టెన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Updated On 22 Feb 2024 6:18 AM GMT
Ehatv

Ehatv

Next Story