సరిగ్గా పదేళ్ల కిందట కేదార్‌నాథ్‌లో(Kedharnath) సంభవించిన పెను విపత్తు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. చోరాబరి హిమనీనదం కరిగిపోవవడం వల్ల మందాకిని నది పొంగిపొర్లింది. ఫలితంగా విపరీతమైన వరదలు(Floods) వచ్చాయి. జల విలయానికి కారణమయ్యింది. సరిగ్గా ఇలాంటి జలప్రళయమే అమెరికాలోని అలస్కాలో(Alaska) కూడా సంభవించింది. అలస్కాలో మెండెన్‌హాల్‌(mendenhall) అనే నది ప్రవహిస్తుంటుంది.

సరిగ్గా పదేళ్ల కిందట కేదార్‌నాథ్‌లో(Kedharnath) సంభవించిన పెను విపత్తు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. చోరాబరి హిమనీనదం కరిగిపోవవడం వల్ల మందాకిని నది పొంగిపొర్లింది. ఫలితంగా విపరీతమైన వరదలు(Floods) వచ్చాయి. జల విలయానికి కారణమయ్యింది. సరిగ్గా ఇలాంటి జలప్రళయమే అమెరికాలోని అలస్కాలో(Alaska) కూడా సంభవించింది. అలస్కాలో మెండెన్‌హాల్‌(mendenhall) అనే నది ప్రవహిస్తుంటుంది. ఇదే పేరుతో అక్కడ అతి పెద్ద మంచు దిబ్బ(snow mound) ఉంది. జనెవు నగరానికి సమీపంలో కొండల నడుమ ఉన్నదీ హిమానీనదం(glacier). దీని కారణంగా ఇక్కడ ఓ సరస్సు కూడా ఏర్పడింది. ఈ సరస్సు నుంచే నది ప్రవహిస్తుంటుంది. సరస్సుకు ప్రకృతి సిద్ధంగా ఓ అడ్డుకట్ట ఏర్పడింది. ఇప్పుడు అది తెగిపోవడంతో నదికి ఆకస్మికంగా వరద పోటెత్తింది. ఫలితంగా పెను విపత్తు ఏర్పడింది. పలు రోడ్లు నీట మునిగాయి. రెండు భవనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. మరెన్నో భవనాలు ప్రమాదం అంచున ఉన్నాయి.

ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. వంతెనలు కూలిపోయాయి. కొందరు వరద నీటిలో కొట్టుకుపోయారు. రెస్క్యూ సిబ్బంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నది తీర ప్రాంతం కోతకు గురయ్యింది. ఫలితంగా అక్కడ ముప్పు మరింతగా పెరిగింది. నది నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తోందని, భారీ వృక్షాలతో పాటు మట్టి కూడా కొట్టుకువస్తోందని, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎమర్జెన్సీ ప్రకటించామని జెనెవు నగర డిప్యూటీ సిటీ మేనేజర్‌ రాబ్‌ బర్న్‌ తెలిపారు. ఇదిలా ఉంటే హిమానీనదం గురించి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ హిమానీనదం పగిలిపోయే అవకాశాలు ఒక శాతం మాత్రమే ఉన్నాయని అంటున్నారు. అయితే ఆకస్మికంఆ ఈ విపత్తు సంభవించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని చెప్పారు. ఇది గ్లోబల్‌ వార్మింగ్‌ పరిణామాలకు సంకేతమని హెచ్చరిస్తున్నారు. జనెవుకు చెందిన శామ్‌ నోలన్‌ అనే ఫోటోగ్రాఫర్‌ నది ఒడ్డున ఓ భవంతి కూలిపోతున్న దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. నదిలోని నీరు ఉధృతంగా రావడానికి తోడు, నదిలోని మట్టి కోతకు గురి కావడంతో భవనం అమాంతం కూలిపోయిందన్నారు. ప్రకృతి ప్రకోపాన్ని ఎవరూ అడ్డుకోలేరని శామ్‌ నోలన్‌ అంటున్నాడు.

Updated On 9 Aug 2023 1:08 AM GMT
Ehatv

Ehatv

Next Story