నేపాల్‌లోని బజురాలోని దహాకోట్‌లో గురువారం రాత్రి రెండుసార్లు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8, 5.9గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూప్రకంపనల వ‌ల్ల‌ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

నేపాల్‌(Nepal)లోని బజురాలోని దహాకోట్‌లో గురువారం రాత్రి రెండుసార్లు భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8, 5.9గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(National Center for Seismology) తెలిపింది. భూప్రకంపనల వ‌ల్ల‌ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. నేపాల్‌లోని సుర్‌ఖేత్ జిల్లా భూకంప కేంద్రం అధికారి రాజేష్ శర్మ(Rajesh Sharma) మాట్లాడుతూ.. మొదటి భూకంపం రాత్రి 11.58 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) 4.9 గా నమోదైంది. రెండవ భూకంపం అర్ధ‌రాత్రి 1.30 గంటలకు 5.9 తీవ్రతతో సంభవించింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.

రెండు రోజుల క్రితం ఇండోనేషియా(Indonesia)లో కూడా భూమి కంపించింది. పశ్చిమ ప్రావిన్స్‌లోని వెస్ట్ సుమత్రా(Sumatra)లో మంగళవారం తెల్లవారుజామున 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. సునామీ(Tsunami)ని ప్రేరేపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ‌, క్లైమాటాలజీ, జియోఫిజిక్స్ ఏజెన్సీ అల‌ర్ట్ కూడా ప్ర‌క‌టించారు.

Updated On 27 April 2023 9:04 PM GMT
Yagnik

Yagnik

Next Story