మలేషియాలో(Malaysia) ఆ దేశ నావికాదళానికి చెందిన రెండు హెలికాఫ్టర్లు(Helicopter) ఆకాశంలో ఢీకొన్నాయి. ఈ ఘటనలో పది మంది సిబ్బంది చనిపోయారు. విన్యాసాలు చేస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నెల 26వ తేదీన మలేషియాలో రాయల్‌ మలేషియన్‌ నేవీ దినోత్సవం జరగనుంది. ఇందుకోసం 23వ తేదీన పెరక్‌లోని లుమత్‌(Lumath) ప్రాంతంలో రిహార్సల్స్‌ నిర్వహించారు.

మలేషియాలో(Malaysia) ఆ దేశ నావికాదళానికి చెందిన రెండు హెలికాఫ్టర్లు(Helicopter) ఆకాశంలో ఢీకొన్నాయి. ఈ ఘటనలో పది మంది సిబ్బంది చనిపోయారు. విన్యాసాలు చేస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నెల 26వ తేదీన మలేషియాలో రాయల్‌ మలేషియన్‌ నేవీ దినోత్సవం(Royal Malaysian Navy Day) జరగనుంది. ఇందుకోసం 23వ తేదీన పెరక్‌లోని లుమత్‌(Lumath) ప్రాంతంలో రిహార్సల్స్‌ నిర్వహించారు. విన్యాసాల కోసం పడంగ్‌ సితియావాన్‌ నుంచి గాల్లోకి ఎగిరిన రెండు హెలికాఫ్టర్లు ప్రమాదవశాత్తూ కొద్ది సేపటికే ఢీ కొన్నాయి. వీటిలో ఒకటి విన్యాసాలు జరుగుతున్న ప్రాంతం దగ్గరే ఉన్న స్టేడియంలో కూలిపోయింది. మరొకటి ఈత కొలనులో పడింది. ఈ ఘోర ప్రమాదంలో రెండు హెలికాఫ్టర్లలో ఉన్న పది మంది సిబ్బంది చనిపోయారు. ఇందులో ఇద్దరు లెఫ్టినెంట్‌ కమాండర్లు కూడా ఉన్నారు. హెలికాప్టర్లు కూలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ మధ్యనే జపాన్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. గత శనివారం అర్ధరాత్రి పూట ప్రత్యేక శిక్షణ కోసం వెళ్లిన రెండు నౌకాదళ హెలికాఫ్టర్లు ఢీకొని సముద్రంలో కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు.

Updated On 23 April 2024 1:54 AM GMT
Ehatv

Ehatv

Next Story