20 కోట్ల విలువైన కొకైన్‌ను దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు బ్రెజిలియన్లను ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు కస్టమ్స్ విభాగం అధికారులు తెలిపారు.

20 కోట్ల విలువైన కొకైన్‌ను దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు బ్రెజిలియన్లను ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు కస్టమ్స్ విభాగం అధికారులు తెలిపారు. నిందితులు బ్రెజిల్‌కు చెందిన మహిళ, పురుషుడు ఉన్నారు. ఇద్దరు ప్రయాణికులు తాము కొన్ని మత్తు పదార్థాలతో కూడిన క్యాప్సూల్స్ తీసుకున్నట్లు అంగీకరించారని కస్టమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ పొట్టలో పెట్టుకుని వాళ్లు డ్రగ్స్‌ తరలించినట్లు అధికారులు గుర్తించారు. ఆపై ఆస్పత్రికి తరలించి శస్త్ర చికిత్స చేసి పురుషుడి కడుపులోనుంచి 937గ్రా.బరువున్న 105, మహిళ నుంచి 562గ్రా. 58 క్యాప్సుల్స్ బయటకు తీశారు. వీటి విలువ రూ.20cr ఉంటుందని అధికారులు చెప్పారు.

ehatv

ehatv

Next Story