మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వెరిఫైడ్ ఖాతాల నుండి ఉచిత బ్లూ టిక్‌లను తొలగిస్తోంది. ఈ మేర‌కు బ్లూ టిక్ ప్లాన్ కోసం డబ్బు చెల్లించని వారి ట్విట్టర్ ఖాతా నుండి బ్లూ టిక్‌లు తొలగించబడ్డాయి. ఏప్రిల్ 12న వెరిఫైడ్ ఖాతాల‌ నుంచి బ్లూ టిక్‌ను తొలగిస్తున్నట్లు మస్క్ ప్రకటించారు. ఏప్రిల్ 20 నుండి వెరిఫైడ్‌ ఖాతా నుండి లెగసీ బ్లూ టిక్ మార్క్ తొలగించబడుతుందని చెప్పారు. ఈ ప్ర‌క‌ట‌న‌లో.. బ్లూ టిక్ కావాలంటే ప్రతి నెలా డ‌బ్బు చెల్లించాల్సి ఉంటుందని మస్క్ పేర్కొన్నాడు.

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్(Twitter) వెరిఫైడ్ ఖాతాల(Verified Accounts) నుండి ఉచిత బ్లూ టిక్‌(Free Blue Tick)లను తొలగిస్తోంది. ఈ మేర‌కు బ్లూ టిక్ ప్లాన్ కోసం డబ్బు చెల్లించని వారి ట్విట్టర్ ఖాతా నుండి బ్లూ టిక్‌లు తొలగించబడ్డాయి. ఏప్రిల్ 12న వెరిఫైడ్ ఖాతాల‌ నుంచి బ్లూ టిక్‌ను తొలగిస్తున్నట్లు మస్క్(Elon Musk) ప్రకటించారు. ఏప్రిల్ 20 నుండి వెరిఫైడ్‌ ఖాతా నుండి లెగసీ బ్లూ టిక్ మార్క్ తొలగించబడుతుందని చెప్పారు. ఈ ప్ర‌క‌ట‌న‌లో.. బ్లూ టిక్ కావాలంటే ప్రతి నెలా డ‌బ్బు చెల్లించాల్సి ఉంటుందని మస్క్ పేర్కొన్నాడు.

ట్విట్టర్ కొత్త విధానం అమల్లోకి వచ్చిన వెంటనే.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath), సల్మాన్ ఖాన్(Salman Khan), షారూక్ ఖాన్(Sharukh Khan) సహా ప్రముఖులందరి బ్లూ టిక్‌లు తొలగించబడ్డాయి. అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), సచిన్ టెండూల్కల్(Sachin Tendulkar), విరాట్ కోహ్లీ(Virat Kohli) బ్లూ టిక్‌లను కూడా ట్విట్టర్ తొలగించింది. యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్(Brajesh Patak), బీఎస్పీ అధినేత్రి మాయావతి(Mayawathi), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి(Bhupendra Singh) సహా చాలా మంది ట్విట్టర్ ఖాతాల నుండి బ్లూ టిక్‌లు తొలగించబడ్డాయి.

గత ఏడాది ఎలాన్ మస్క్‌ని కొనుగోలు చేయడానికి ముందు.. జర్నలిస్టులు, నటులు, రాజకీయ నాయకులకు సంబంధించిన అనేక ఖాతాలను ట్విట్టర్ ధృవీకరించింది. ఇంతకు ముందు ట్విటర్‌లో డబ్బులు తీసుకోకుండా బ్లూ టిక్‌లు ఉచితంగా ఇచ్చేది. ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన అనంత‌రం.. ప్లాట్‌ఫారమ్ ఉన్న‌ ఎవరైనా కనీస రుసుముతో ధృవీకరించబడవ‌ల‌సిందేన‌ని మస్క్ విశ్వసించారు.

ట్విట‌ర్‌ బ్లూ టిక్ ధర ఒక్కో దేశంలో ఒకోలా ఉంది. భారతదేశంలో ఐఓఎస్ ట్విట‌ర్‌ బ్లూ ధర నెలవారీ రూ. 900 కాగా.. వెబ్ అయితే నెలవారీ రూ. 650 గా ఉంది. ఐఓఎస్‌ వార్షిక ధర రూ. 9,400 కాగా.. ఆండ్రాయిడ్ వినియోగదారులకు నెలవారీ ధర రూ.900.. వార్షిక ధర రూ.9,400గా నిర్ణ‌యించింది.

Updated On 21 April 2023 2:48 AM GMT
Yagnik

Yagnik

Next Story