అమెరికాలోని భారతీయ విద్యార్థుల్లో ఆందోళన కాస్త ఎక్కువైంది. ట్రంప్‌ దుందుడుకు చర్యలే ఇందుకు కారణమని తెలుస్తోంది.

అమెరికాలోని భారతీయ విద్యార్థుల్లో ఆందోళన కాస్త ఎక్కువైంది. ట్రంప్‌ దుందుడుకు చర్యలే ఇందుకు కారణమని తెలుస్తోంది. ట్రంప్ రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా మంది విద్యార్థులు పార్ట్‌ టైం ఉద్యోగాలను వదులుకుంటున్నారు. కొత్త ఇమ్మిగ్రేషన్‌ చట్టాల భయమే ఇందుకు కారణం. వారిలో చాలామంది ఉన్నత చదువుల కోసం అప్పులు చేసి అమెరికా వచ్చినవాళ్లే. దాంతో తల్లిదండ్రులకు భారంగా కావద్దని పార్ట్‌టైమ్‌గా చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తుంటారు. ఎఫ్‌–1 వీసాపై ఉన్న విద్యార్థులకు వారానికి 20 గంటల వరకు పని చేయడానికి అనుమతి ఉంది. కానీ చట్టం, వీసా నిబంధనలు పాటించకుండా ఉద్యోగాలు కూడా చేస్తుంటారు. కానీ ఇకపై అలాంటివి చేస్తూ పట్టుబడితే డైరెక్ట్‌ డీపోర్టేషనేనని ట్రంప్‌ హెచ్చరించడంతో మన విద్యార్థులు రిస్క్‌ తీసుకోవడానికి ఇష్టపడడంలేదు. కొన్ని నెలలపాటు పరిస్థితి చూశాకే పార్ట్‌టైం ఉద్యోగాలపై నిర్ణయానికి వస్తామంటున్నారు. మన విద్యార్థులను హైర్ చేసుకున్న కొన్ని భారతీయ కంపెనీలు, మాల్‌లు, ఇతర సంస్థలు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా మన భారతీయ విద్యార్థులకు భారతీయులకు సంబంధించిన సంస్థల్లో పనిచేయడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ట్రంప్‌ భయంతో ఉద్యోగాలు వదులుకోవడంతో ఆయా సంస్థలకు కూడా మానవ వనరుల కొరత ఏర్పడింది. ఇప్పటిదాకా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ చదువుకోవచ్చనే ధీమా ఉండేదని, ఇప్పుడది కాస్తా పోయిందని మన విద్యార్థులు ఆవేదన చెందుతుందున్నారు.

మరోవైపు ఇండియన్ పేరెంట్స్‌కు అమెరికాలోకి అనుమతి ఇవ్వడం లేదు. రాను, పోను టికెట్‌ బుకింగ్స్‌ ఉంటేనే స్టూడెంట్స్ తల్లిదండ్రులకు అనుమతి ఇస్తున్నారు. రిటర్న్‌ టికెట్ ఉంటేనే అమెరికాలోకి ఇండియన్స్ ఎంట్రీ అంటూ అధికారులు ఆంక్షలు పెట్టారు. దీంతో పాటుగా ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలు మరింత కఠిన తరం చేశారు. ఈ నేపథ్యంలోనే న్యూయార్క్‌ ఎయిర్‌పోర్టులో పలువురిని అధికారులు అడ్డుకున్నారు.

రిటర్న్‌ టికెట్ లేదని కంట్రీలోకి నో ఎంట్రీ అని అధికారులు పేరెంట్స్‌ను అడ్డుకుంటున్నారు.

Updated On 26 Jan 2025 3:00 AM GMT
ehatv

ehatv

Next Story