అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం వలసదారుల కోసం సరికొత్త "గోల్డ్ కార్డ్"ను ప్రకటించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం వలసదారుల కోసం సరికొత్త "గోల్డ్ కార్డ్"ను ప్రకటించారు. అమెరికాకు వెళ్లి ఉద్యోగాలు కల్పించాలనుకునే విదేశీయులకు ఒక్కోటి 5 మిలియన్ డాలర్ల ధర కలిగిన ఈ కార్డులను విక్రయిస్తామని ట్రంప్ తెలిపారు. ఇది వలసదారులకు పౌరసత్వానికి మార్గాన్ని అందిస్తుంది. "EB-5" ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్‌ను భర్తీ చేస్తానని చెప్పారు, అమెరికాలో వ్యాపారాలలో పెట్టుబడులు పెడతామని వచ్చే విదేశీయులకు గ్రీన్ కార్డ్‌లను మంజూరు చేస్తుందన్నారు ట్రంప్. ఇది గ్రీన్ కార్డ్ అర్హతను కల్పిస్తుంది. ఇది (అమెరికన్) పౌరసత్వానికి ఒక మార్గంగా ఉంటుంది, ఈ కార్డును కొనుగోలు చేయడం ద్వారా సంపన్నులు మన దేశంలోకి వస్తారని ట్రంప్‌ అన్నారు.

రెండు వారాల్లో పథకం వివరాలను ప్రకటిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. ద్రవ్యలోటును తగ్గించడానికి ఫెడరల్ ప్రభుత్వం 10 మిలియన్ల "గోల్డ్ కార్డులను" విక్రయించే అవకాశం ఉంన్నారు. ఈ గోల్డ్‌ కార్డు ద్వారా దేశంలోకి సంపన్నులు వస్తారన్నారు.

ehatv

ehatv

Next Story