రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 10న జ‌రుగనున్న‌ ఏబీసీ న్యూస్ డిబేట్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు.

రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 10న జ‌రుగనున్న‌ ఏబీసీ న్యూస్ డిబేట్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అయితే.. సెప్టెంబర్ 4న ఫాక్స్ న్యూస్‌లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌తో చర్చకు ఆయన అంగీకరించారు. ట్రంప్‌పై కమలా హారిస్ స్పందిస్తూ.. సెప్టెంబర్ 10న చర్చా వేదికకు తాను హాజరవుతానని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో తెలిపింది.

హారిస్ ట్రంప్ నిర్ణ‌యంపై స్పందిస్తూ.. ఆశ్చ‌ర్యంగా ఉంది.. ఓ టైం, ప్లేస్ సుర‌క్షితం ఎలా అవుతుంది. ట్రంప్ ముందుగా అంగీకరించినట్లు నేను సెప్టెంబర్ 10న అక్కడ ఉంటాను. ట్రంప్ అక్కడ ఉంటారని నేను ఆశిస్తున్నానని వ్యంగ్యంగా రియాక్ట‌య్యారు. ట్రంప్ తన సోషల్ మీడియా సైట్ ట్రూత్ సోషల్‌లో సెప్టెంబర్ 10న ABC న్యూస్ చర్చకు హాజరు కావడానికి నిరాకరించారు.

జాతీయ స్థాయిలో జరిగిన పోలింగ్‌లో కమలా హారిస్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అధ్యక్షుడు జో బిడెన్ కంటే ఆమె చర్చ వేదికలపై ట్రంప్‌కు బలమైన సవాలును విసిరారు. కొంతకాలం క్రితం బిడెన్‌పై బలంగా కనిపించిన ట్రంప్‌.. ఇప్పుడు హారిస్‌తో గ‌ట్టి పోటీ ఎదుర్కుంటున్నారు.

ముందుగా శనివారం డోనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 4న కమలా హారిస్‌తో చర్చలో పాల్గొనడానికి అంగీకరించారు. అయితే ఆయ‌న అనూహ్యంగా నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు. వాస్తవానికి, ఫాక్స్ న్యూస్ ట్రంప్, హారిస్‌లను చర్చకు ఆహ్వానించింది. ఈ ఈవెంట్ సెప్టెంబర్ 4న పెన్సిల్వేనియాలో జరగాల్సి ఉంది.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story